Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 16 October 2014

మరుని ముద్దులాడె గిరికుమారి. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

మరుని ముద్దులాడె గిరికుమారి. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


మరుని ముద్దులాడె గిరికుమారి.

Posted: 15 Oct 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - మరుని ముద్దులాడె గిరికుమారి.


ఆటవెలది:
తలచి నంత సుతుని నలుగుతో జేసెను
తలను ద్రుంచి వేసె తండ్రి , కడకు
కరి ముఖమ్ము బెట్టి గణనాథు జేయ కొ
మరుని ముద్దులాడె గిరికుమారి.
... పూర్తిటపా చదవండి...

మిసెస్ థాచర్… స్యూ టౌన్ సెండ్, ఇంగ్లీషు రచయిత్రి

Posted: 15 Oct 2014 11:56 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(ఇది చాలా ప్రతిభావంతమైన కవిత. ఏ అలంకారాలూ లేనట్టు కనిపించినా, పదునైన వ్యంగ్యం ఉంది ఇందులో.ఇంగ్లండు ప్రథానమంత్రి థాచర్ ప్రభుత్వం చేపట్టిన విధానాలకు 30 లక్షలమంది నిరుద్యోగులుగా మారినపుడు రాసిన కవిత ఇది.

ఓట్లు దండుకుందికి, అందరూ మొసలి కన్నీళ్ళు కారుస్తారు.  పాకలలో దూరుతారు. వాళ్ల మంచాలమీద కూర్చుని చెప్పలేని సానుభూతి ఒలక బోస్తారు. అదంతా అందలం ఎక్కడనికే తప్ప వాళ్ళ కన్నీళ్ళు తుడవడానికి కాదు. ఈ సత్యాన్ని చాలా నిశితంగా విమర్శించిన కవిత)

పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి - 10

Posted: 15 Oct 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- భానుమతి.
(దుర్యోధనుని భార్య, సహదేవుని భార్య, సినీనటి వీరిలో ఎవరి గురించి వ్రాసినా సరే!)ఛందస్సు- ఆటవెలఁది.నాలుగు పాదాలలో చివరి అక్షరాలు వరుసగా భా, ను, మ, తి ఉండాలి.
... పూర్తిటపా చదవండి...

ఆండ్రాయిడ్ కొత్త వెర్షను లాలిపప్ తెలుగుతో విడుదలైంది

Posted: 15 Oct 2014 10:52 AM PDT

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
         ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ యొక్క కిట్‌కాట్ (4.4) తరువాతి వెర్షను లాలిపప్ (5.0) విడుదలైనట్లు గూగుల్ ఇప్పుడే ప్రకటించింది. ఈ విడుదలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పుడు మనం తెలుగులో కూడా వాడుకోవచ్చు. 

తనువున విరిగిన యలుగుల - పద్యం

Posted: 15 Oct 2014 09:56 AM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
                                                        తనువున విరిగిన యలుగుల - పద్యం  

తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను  మెన్ని యుపాయములను వెడలునె  యధిపా!

భావం:-శరీరంలోకి  దిగిన బాణాలను అతి  కష్టంమీద బయటకు తీయవచ్చు. బాణం  చేసిన గాయాలను
           మాన్పవచ్చు .  కాని ఇతరులకు కష్టాన్ని కలిగించేట్లు మాట్లాడిన  మాటలను  తొలిగించడం ఎన్ని
... పూర్తిటపా చదవండి...

వెన్నెలల చందనాల బొమ్మలు

Posted: 15 Oct 2014 09:51 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
చందమామ తెచ్చెనమ్మ చందనాల వెన్నెలలు
వెన్నెలల చందనాల హత్తుకున్న బొమ్మలు
అవి ఎవ్వరివమ్మా? అవి ఎవ్వరివమ్మా? ;                 ||చందమామ ||                          

మిత్రులను వెక్కిరించి, అన్నయ్యను గోకి          
పొన్నచెట్టు కొమ్మలలో దాగినాడు క్రిష్ణుడు        
పొదరిళ్ళలోన నక్కినక్కి నవ్వేటి క్రిష్ణుని                                            
తనివితీర చూడాలని తహతహలా జాబిలికి;                ||చందమామ ||                            

"అల్లరి మానాలంటూ" ఆకతాయి క్రిష్ణుని                  
తల్లి జనని యశోదమ్మ తర్జనిని... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger