Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 26 October 2014

తృప్తి ... వర్ణన. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

తృప్తి ... వర్ణన. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


తృప్తి ... వర్ణన.

Posted: 25 Oct 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తృప్తి ... వర్ణన.

ఆటవెలది:
ఉన్న వాడు కనగ నున్న వాడే కాదు
లేని వాడు తృప్తి లేని నాడు
లేని వాడు నిజము లేని వాడే కాదు
ఉన్న వాడు తృప్తి యున్న నాడు.
... పూర్తిటపా చదవండి...

చినుకులు

Posted: 25 Oct 2014 01:57 PM PDT

రచన : విఘ్నేశ్వర్ రాపోలు | బ్లాగు : నా తాత్కాలిక బ్లాగు
ఈశాన్య ఋతుపవనాల వళ్ళ అనుకుంటా పొద్దున్నుండీ జల్లు కురుస్తూ ఉంది. ఈ ముసురు ఇప్పట్లో తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. వరండాలో నిల్చుని చెయ్యి చాచి చూస్తే సన్నగా చినుకులు పడుతున్నాయి. ఈ చినుకులు నన్ను ఏమి చేస్తాయి అనుకుని అలా నడుద్దామని బయలుదేరితే చల్లగా పలకరించింది వాన చినుకు. అది మీద పడగానే ఝల్లు మంది, అయినా హాయిగానే ఉంది. అడుగులు వేస్తూ ముందుకు కదులుతున్నా, నా ఆలోచనలు మాత్రం నీ చుట్టే. నీ... పూర్తిటపా చదవండి...

ఒంటరితనం

Posted: 25 Oct 2014 01:40 PM PDT

రచన : జొన్నలు | బ్లాగు : : జొన్నలు :
ఒంటరితనం ఎంతటి భయానకం! ఇంతటి నిరుత్సాహన్ని, ఇంతటి మానసిక ఆందోళను కలిగిస్తుందని అనుకోలేదు ఇన్నాళ్ళు. తలవంచాను ఈ ఒంటరితనానికి. పరిస్థితులు చేజారిపోతుంటే నాకు అర్ధం కాలేదు. ఓంటరితనమే వీటన్నిటికి మూలమని ఇప్పుడు తోస్తుంది. 

మనకి, మన మనసుకి ఓ తోడు కావాలి. వాళ్ళతొ ఏకాంతంగా గడపాలి, వాళ్ళకి సేవలు చెయ్యాలి, సేవలు పొందాలి, వాళ్ళని వాళ్ళ మ... పూర్తిటపా చదవండి...

తన మృతిపై … వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

Posted: 25 Oct 2014 12:33 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

 మృత్యువు నామీద నిలబడింది, వంగి, తలవాల్చి

నా చెవిలో ఏదో గుసగుసలాడుతోంది;

ఆ వింతభాష నాకు అర్థం కాలేదు గాని,

తెలిసిందల్లా, ఇకపై భయపడనవసరం లేదని.

.

వాల్టర్ సావేజ్ లాండర్

30 జనవరి- 1775 – 17 సెప్టెంబరు 1864

ఇంగ్లీషు కవి

On His Own Death

.

Death stands above me, whispering low   

I know not what into my ear: 

... పూర్తిటపా చదవండి...

కర్దమ ప్రజాపతి - దేవహుతి

Posted: 25 Oct 2014 12:19 PM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
కర్దమ ప్రజాపతి కృతయుగంలో జన్మించారు. ఒకనాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ మహర్షిని తన సృష్టి కార్యంలో సహాయం చేయవలసినది అని అడిగారు. అప్పుడు కర్దమ ఋషి సరస్వతి నదీతీరంలో తపస్సు మొదలు పెట్టారు. అలా 10000 సంవత్సరముల పాటు తపస్సు చేసిన తరువాత ఒకరోజు శ్రీమహావిష్ణువు అతనికి దర్శనం  ఇచ్చారు. ఆ ఆనందంలో కర్దమ ఋషి  అనేక విధములుగా విష్ణుని పూజించి, కీర్తించి, అప్పుడు బ్రహ్మ తనముందు ఉంచిన భాద్యతను నిర్వర్తించుటకు ఒక అనుకూలవతి అయిన కన్య ఎక్కడ ఉంటుందో చెప్పవలసినది అని కోరారు.
అతని సేవలకు , తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ  కన్య స్వాయంభువ మనువు కు జన్మించ... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమ ఖండ కధనం -2 ప్రధమాశ్వాసం

Posted: 25 Oct 2014 12:09 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -2

ప్రధమాశ్వాసం

శ్రీనాధుడు ప్రధమాశ్వాసం లో ముందుగా ఉత్పలమాలలో ద్రాక్షారామ భీమేశ్వరుని స్తుతించి ఆయన అన్నయ మంత్రికి సకల శుభాలు కలిగించికాపాడాలని కోరాడు .

''శ్రీ స్తన గంధ సార పరి పేష సమంచిత సాయక ప్రయో –గాస్తమహా పురత్రాయు దాహార్య ధనుర్ధరుడర్క కోటి దీ

ప్తి స్తవనీయ విగ్రహుడు భీమయ దేవుడు దక్ష వాటికా –వాస్తుడు ప్రోచు గావుత ధ్రువంబుగ దేవయ యన్న దీమణిన్ ''

అర్ధం –శ్రీలక్ష్మీ దేవి పాలిండ్లపై ఉన్న గంధపు పూతను హత్తుకొన్న వక్షస్థలం కల శ్రీమహా విష్ణువు ను బాణం గా చేసి ,మేరు పర్వతాన్ని ధనుస్సుగా ,త్రిపురాలను దహించిన వాడు ,కోటి సూర్య ప్రభలతో దివ్యమైన... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 16

Posted: 25 Oct 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
రామపట్టాభిషేకాన్ని వర్ణిస్తూ తేటగీతి వ్రాయండి.
మొదటిపాదాన్ని 'రా'తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా 'మ' నిషిద్ధం.
రెండవపాదాన్ని 'భ'తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా 'ర' నిషిద్ధం.
మూడవపాదాన్ని 'ల'తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా 'క్ష్మ' నిషిద్ధం.
నాలుగవపాదాన్ని 'శ'తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా 'త్రు' నిషిద్ధం.
నిషిద్ధాక్షరాలు కేవలం పాదంలో రెండవస్థానానికే పరిమితం. పద్యంలో మిగిలిన స్థానాలలో వాడవచ్చు.
... పూర్తిటపా చదవండి...

ఇప్పుడు మొబైల్ ద్వారా కూడా విజ్ఞానాన్ని పోగుచేయవచ్చు

Posted: 25 Oct 2014 10:08 AM PDT

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
      లాభాపేక్షలేకుండా స్వచ్చందంగా విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ప్రకటనలు లేకుండా అందించడానికి ఏర్పడిన ఆన్‌లైన్ వేధిక వికీపీడియా. ఇది ఆంగ్ల భాషలోనే కాకుండా తెలుగుతో పాటు మరెన్నో ప్రపంచభాషలలో సమాచారాన్ని మనకందిస్తుంది. ఈ మహాయజ్ఞంలో మనలాంటి సాధారణ పౌరులు వారి తీరిక సమయాన్ని వెచ్చించి సమాచారాన్ని పోగుచేస్తున్నారు. విజ్ఞానాన్ని అరచేతిలోకి (వికీపీడియా మొబైల్) అందుబాట... పూర్తిటపా చదవండి...

మహాభారతం-హరిమోహన్ ఝా -జె. లక్ష్మీరెడ్డి - తెలుగు

Posted: 25 Oct 2014 09:45 AM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
మైథిలీ మూలం 'ఖట్టర్ కాకా' హరిమోహన్ ఝా మహాభారతం నేను ప్రాతఃశ్లోకాలు చదువుతూ ఉన్నాను - 'పుణ్య శ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిరః' (నల మహారాజు పుణ్యచరితుడు, యుధిష్ఠిరుడు పుణ్య చరితుడు) ఇంతలో వికటకవి చిన్నాన్న వచ్చి అన్నాడు - అరే, ప్రొద్దున్నే ఈ వ్యర్థుల పేర్లు జపిస్తున్నావేమిటి? నేను - చిన్నాన్నా, ధర్మరాజు లాంటి సత్ఫురుషుని గురించి మీరిట్లా మాట్లాడతారేమి? చిన్నాన్న - ధర్మరాజు కాదు,... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment