Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 31 December 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ పిండం. ఇంకా 11 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ పిండం. ఇంకా 11 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ పిండం.

Posted: 30 Dec 2014 04:06 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఆత్మ పిండం. "ఆత్మ పిండం" అంటే ఏంటండీ?" అంటూ వచ్చాడు మా సత్తిబాబు. సనాతన ధర్మంలో (హిందూ మతమన్నది లేదు దాని గురించి వేరుగా చెబుతాలే) తనకు చనిపోయిన తరవాత కర్మ చేసి ఉత్తరగతులు కలిగించేవారు లేనివారు, ఈ ఆత్మ పిండాన్ని వేసుకునేవారు. అదెలాగంటే కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, ప్రయాగలో త్రివేణిలో ములిగి గయా ( గయకాదు. గయా స్టేషనులో కూడా గయా అనేరాసుంటుంది) వెళ్ళడమూ అక్కడ పెద్దలకు మూడు చోట్ల పిండాలు వేయడమూ […]... పూర్తిటపా చదవండి...

పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.

Posted: 30 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.


తేటగీతి:
నరుల శుద్ధులజేయగా నదిగ దిగెను
మురికి కూపమ్ము జేసెను మూర్ఖ నరుడు
బుద్ధి లేనట్టి నరునికై భువికి వచ్చి
పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.
... పూర్తిటపా చదవండి...

శాండిల్, ఓట్ మీల్ ప్యాక్

Posted: 30 Dec 2014 03:17 PM PST

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
శాండిల్, ఓట్ మీల్ ప్యాక్ ట్రై చేయండి. ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి, పావు కప్పు రోజ్ వాటర్, అర టీ స్పూన్ పసుపు తీసుకుని ఈ మూడింటిని కలిపి ముఖానకి అప్లై చేసి 30 నిమిషాలాగి చల్లటినీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై నలుపు తొలగి చర్మం తాజాగా వుంటుంది. 
పూర్తిటపా చదవండి...

తాగడం అవసరమా?

Posted: 30 Dec 2014 01:42 PM PST

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

పార్టీలో కూర్చోవడమంటే చాలామందికి మంచి సరదా… సరంజామా అన్నీ సమకూర్చుకుని తాపీగా సోది చెప్పుకుంటూ లాగించేసే కొద్దీ బాటిళ్లు బాటిళ్లు ఖాళీ అయిపోతుంటాయి..

తాగడం పదేళ్ల క్రితం వరకూ పెద్ద తప్పుగానే భావించబడుతూ వచ్చేది. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం 2005లో నేను లాస్ట్ టైమ్ డ్రింక్ చేశాను.. డ్రింక్ అంటే బీర్ మాత్రమే. "ఇక లైఫ్‌లో డ్రింక్ చెయ్యకూడదు" అని డిసైడ్ చేసుకుని మానేసి ఇప్పటికి 9 సంవత్సరాలైపోయింది.

ఇప్పుడు తాగడం తల్లిదండ్రులకు తెలిసినా పెద్దగా సీరియస్‌గా ఎవరూ తీసుకోవట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే అది acceptable habit అయిపోయింది. ఇక FBలో అయితే చాలామంది చాలా దర్జాగా మందు గ్లాసులు పట్టుకుని... పూర్తిటపా చదవండి...

చర్చిలో… ఫెడ్కోవిచ్, యూక్రెయిన్ కవి

Posted: 30 Dec 2014 12:02 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

దేవుని మందిరం నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంది.
అంతటా నిశ్చేష్టత అలముకుంది, ఎవరూ కదలడం లేదు
ఒక్క మతగురువు మాత్రమే పుస్తకంలోంచి
ప్రార్థనలు చదువుతున్నాడు;
ఉన్న ఒకే ఒక కొవ్వొత్తి తొందరగా కరిగిపోతోంది.  
గోడలమీది బంగారు విగ్రహాలు
క్రిందకి ఆశ్చర్యంతో చూస్తున్నాయి.

ఆ రాళ్ళ మీద, చల్లని కాలిబాట మీద<... పూర్తిటపా చదవండి...

జీవనం

Posted: 30 Dec 2014 11:20 AM PST

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష

దత్తపది - 61 (కలము-చలము-తలము-బలము)

Posted: 30 Dec 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
కలము - చలము - తలము - బలము
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పూర్తిటపా చదవండి...

"ఆరుద్ర బాతాఖూనీ"

Posted: 30 Dec 2014 10:04 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

'జ్యోతి' పత్రికలో అచ్చుతప్పులపై ఆరుద్ర
"ఆరుద్ర బాతాఖూనీ" పేరిట ఓ శీర్షిక నిర్వహించేవారు. అందులో కొన్ని అచ్చు తుప్పులు చెత్తగించండి! )

.

'చల్ మోహన రంగా ! నీకు నాకు జోడు... పూర్తిటపా చదవండి...

వెనకటి నేను 10 – లోతు తెలీని ఈత

Posted: 30 Dec 2014 09:30 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
కలకత్తా ఆంధ్రసంఘం, త్రయోదశవార్షిక సంచిక, 1966 లో ప్రచురించబడింది. లోతు తెలీని ఈత నామాట – ఈ శీర్షిక ఈ కథతో సమాప్తం. ఇదొక గొప్ప కథ అనను కానీ ఇందులో ఇతివృత్తం నాకు చాలా వైయక్తికం. నాజీవితంలో నాకు చాలామందే "ఆప్తమిత్రులు" తటస్థ పడ్డారు. కొన్ని సంవత్సరాలు ఏవిధమైన సంపర్కం లేకపోయినా ఎక్కడో తటస్థపడి మామూలుగా పలకరించుకోడం కూడా జరిగింది కొన్ని సార్లు. అయినా, నాకు మిత్రత్వంగురించి కొంత అసంతృప్తి ఉంది. ఇంతకాలం అయినతరవాత తిరిగి […]... పూర్తిటపా చదవండి...

అగ్నిని నేను

Posted: 30 Dec 2014 08:35 AM PST

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
బంగారు వర్ణాన్ని కలిగి ఉన్నాను 
నేను స్వచ్చమైన అంగారాన్ని 
వస్తువు కాను కాని అన్ని నాలోనే సమాయతమౌతాయి 
పంచభూతాల్లో ఒకటిగా పిలువబడే అగ్నిని నేను 

పూర్తిటపా చదవండి...

మసపుని

Posted: 30 Dec 2014 08:27 AM PST

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand
_______
పూర్తిటపా చదవండి...

జనవరి 1 న్యూఇయర్ కుట్ర

Posted: 30 Dec 2014 08:20 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
జనవరి 1 కొత్త సంవత్సర వేడుకల గురించి భిన్నాప్రాయాలు వ్యక్తమవుతాయి. కొందరు జరుపుకోవద్దంటారు, కొందరు ప్రపంచమంతా జరుపుకుంటున్న వేడుకను మనం మాత్రం జరుపుకుంటే తప్పేంటీ అంటారు. అసలు ఈ న్యూఇయర్ వేడుకలు ఒక 25 ఏళ్ళ కిందట భారత్‌లో లేవు. మరి ఇప్పుడు కొత్తగా ఎలా వచ్చాయి? వీటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? వీటి వెనుకనున్న శక్తులేవి? వీటిని ఇంతలా promote చేయడం వల్ల ఆ శక్తులకు వచ్చే లాభం ఏమిటి? ఈ సందేహాలాన్నిటికి సమాధానం తెలుసుకోవాలంటే ఇది చదవండి. (సమయం తక్కువగా ఉన్నందున సంక్షిప్తంగా వివరిస్తున్నా )

భారత్‌లో న్యూఇయర్ వేడుకలను promote చేయడం వెనుక అమెరిక... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger