Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 19 December 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-“పల్లెప్రపంచం”తో ముఖాముఖీ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-“పల్లెప్రపంచం”తో ముఖాముఖీ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-“పల్లెప్రపంచం”తో ముఖాముఖీ

Posted: 18 Dec 2014 04:03 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
పల్లెప్రపంచం అగ్రిగేటర్‌లో తెలుగులో మంచి బ్లాగులను సమీక్షించాలనే నిర్ణయంలో భాగంగా మొదటిగా కష్టేఫలే శర్మగారి బ్లాగును సమీక్షించాలని అనుకోవడం జరిగిందని మొదటి సమీక్షలోనే వివరించాను. కొన్ని కారణాలవల్ల ఇప్పటి వరకూ అది వాయిదా పడుతూ వచ్చింది. తెలుగు బ్లాగర్లలో కష్టేఫలే  బ్లాగు తెలీనివారుండరనడంలో అతిశయోక్తి లేదు.    పల్లెటూరిలో పుట్టి, వృత్తిరీత్యా పల్లెలలోనే గడిపి, పల్లెలోనే నివాసముంటూ తన కాలక్షేపం కబుర్లు ద్వారా ప్రపంచ వ్యాపితంగా అభిమానులను సంపాదించుకున్న శర్మగారు అభినందనీయులు. పేరుకే కాలక్షేపం కబుర్లని వ్రాస్తున్నా […]... పూర్తిటపా చదవండి...

చల్లగ నయ్యెనీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చి నంతనే

Posted: 18 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - చల్లగ నయ్యెనీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చి నంతనే

ఉత్పలమాల:
పిల్లలు పెద్దలందరును వేడిని తాళక వేగుచుండగా
నల్లన వాయుగుండమది యంబుధి దాటగ ప్రాకుచుండెగా 
నల్లని మేఘమాలికలు నాట్యముజేయుచు నూగుచుండెగా
చల్లగ నయ్యెనీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చి నంతనే. 
పూర్తిటపా చదవండి...

వరుడు వెళ్ళిపోయాక… ఎలిజబెత్ మహారాణి 1

Posted: 18 Dec 2014 11:00 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నేను దుఃఖించాలి, నా అసంతృప్తి ప్రకటించకూడదు
నేను ప్రేమిస్తున్నాను, కానీ ద్వేషిస్తున్నట్టు నటించాలి
నేను ఏ పనిచేసినా, మనసులోమాట చెప్పలేను
నేను ఉత్త మూగగా ఉంటూ లోలోపలే మాటాడుకోవాలి
నేను ఉన్నాను, కానీ లేను; వణుకుతున్నట్టున్నా దహించుకుపోతున్నాను
నేను నానుండి మరో మనిషిలా ఎప్పుడో మారిపోయాను.

నా ఇష్టాలన్నీ ఎండలో నీడలాటివి, పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 25

Posted: 18 Dec 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
అంశం- ఉగ్రవాదము
నిషిద్ధాక్షరములు - కవర్గ (కఖగఘఙలు)
ఛందస్సు - తేటగీతి.
... పూర్తిటపా చదవండి...

మన సంగీత విద్వాంసులు – శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు

Posted: 18 Dec 2014 09:46 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఈ శీర్షికన ఇవాళ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి గురించి తెలుసుకుందాము. వీరు బ్రహ్మశ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి శిష్యులు. వీరి శిష్యులు మంగళంపల్లి వారు. ముందుగా "గానకళ" అన్న సంచికనుండి కొంత, తదుపరి "ఆంధ్ర గాయకుల చరిత్ర" నుండి మరికొంత చూద్దాము. 

No comments :

Post a Comment