Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 17 March 2015

శిల, శిల్పము ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శిల, శిల్పము ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శిల, శిల్పము

Posted: 16 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


వర్ణన - శిల, శిల్పము


కందము:
దెబ్బలు కొట్టగ స్థపతియె
అబ్బాయని యనక మిగుల నణకువ జూపన్
నిబ్బరముగ నాశిలయే
అబ్బురముగ మూర్తి యగుచు నాహా నిలచున్.
... పూర్తిటపా చదవండి...

అమరత్వం… ఫ్లారెన్స్ రాండల్ లివ్ సే, కెనేడియన్ కవయిత్రి

Posted: 16 Mar 2015 02:16 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(యుద్ధరంగంలో క్షణక్షణం మృత్యువును తప్పించుకుంటూ బ్రతికే సైనికుల జీవితాన్ని చక్కగా చెప్పిన కవిత)

.

నేనొకసారి మరణించేను, కానీ కత్తితో
పొడుస్తున్న బాధతో మళ్ళీ ప్రాణం తిరిగొచ్చింది.

మరోసారీ ప్రాణంపోయిందనే అనుకుని
భయపడ్డాను; కానీ ఫిరంగి  చాలా దూరంగా పడింది.

తూటా గాలిని చీల్చుకుంటూ రంయిమని వచ్చింది,
చిన్నప్పటి ప్రార్థన ఒకసారి చదువుకున్నాను.

నాకు తెలివొచ్చేలోగా మరణం సంభవిస్తే
నేను దైవాన్ని కోరుకుంటాను నా ఆత్మని తీసుకుపొమ్మని
నేను మేల్కొనే లోగా…

.

ఫ్లారెన్స్ రాండల్ లివ్ సే

(3rd Nov 1... పూర్తిటపా చదవండి...

ఆశ - నిరాశ

Posted: 16 Mar 2015 01:42 PM PDT

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
ఆశ - నిరాశ / భాను  వారణాసి
---------------------------------------------------

నీ ప్రతిబింబం
నిన్ను వెక్కిరించినపుడు
మనసు  'పోక్రాన్'  పొలిమేరలు దాటినట్లన్పిస్తుంది
గుండె  సవ్వడులను
ప్లాస్టిక్ సంచులలో   నింపి
అనుభూతుల  మొక్కల్ని పెంచాలనిపిస్తుంది
ప్రతి  సమస్యా
అవధానం  చేసినట్లు
సమస్యా పూరణం  చేత గాక
అసంతృప్తిగా మిగిలి పోతున్నట్లన్పిస్తుంది
నిమ్మకు  నీ రెత్తినట్లు
నిమ్మళంగా ఉన్న ఈ  బ్రతుకు
మఱ్ఱి  చెట్టు  ఊడల్ని  లాగి  పారెయ్యాలనిపిస్తుంది
సముద్రపు  కెరటాలు
ఉవ్వెత్తున  లేచ... పూర్తిటపా చదవండి...

"ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకం కినిగెలో లభ్యం

Posted: 16 Mar 2015 10:52 AM PDT

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
FrenchPalanaloYanam600.jpgనే రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" (The Colonial History of Yanam) పుస్తకం కినిగెలో ఈ క్రింది లింకులో లభిస్తుంది.  ఆశక్తికలిగిన మిత్రులు దయచేసి ప్రోత్సహించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను.

... పూర్తిటపా చదవండి...

102వ సుందరకాండ వీడియో

Posted: 16 Mar 2015 10:46 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger