Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 13 March 2015

**కొన్ని మాటలు** ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

**కొన్ని మాటలు** ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


**కొన్ని మాటలు**

Posted: 12 Mar 2015 11:46 PM PDT

రచన : yagnapal raju upendrum | బ్లాగు : **anangavaahini**అనంగవాహిని**
ఒక్కోసారి తను అలాగే చూస్తూంటుంది
నిశ్శబ్దంగా మాట్లాడటమెలాగో
నాకు నేర్పుతున్నట్టు

గాలికి కదిలే కిటికీ తెర
టీపాయ్ మీద కప్పులు
చక్కటి రంగుల్ని పులుముకుని
తళతళలాడే తన చేతి వేళ్ళ గోళ్ళు

చాలాసార్లు
మేమిద్దరం కలిసి దిగిన ఫోటో

ఒక్కోసారి
తన చీర అంచు వెంబడి దారాల ముడులు

అప్పుడప్పుడూ
మెల్లగా చప్పుడు చేసే తన కాలి మువ్వలు

ఇలా వేటితో మాట్లాడినా
ఆ అర్థాలన్నీ నావద్దకే వచ్చి ఆగుతాయి

అవి చాలు
అంతే
... పూర్తిటపా చదవండి...

నాగపూర్ : 13-15 మార్చ్ RSS అఖిల భారతీయ ప్రతినిధి సభ - 2015 సమావేశాలు

Posted: 12 Mar 2015 09:41 PM PDT

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
రేశంబాగ్, నాగపూర్ 13/03/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అత్యున్నత స్థాయి విధాన నిర్ణాయక మండలి అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ - 2015 సమావేశాలు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ రేశంబాగ్ (RSS ప్రధాన కార్యాలయం) లో తేది 13-15 మార్చ్ లలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ మాన్య శ్రీ డా మన్మోహన్ వైద్య మీడియా కు తెలిపారు.

తాటక రాక్షసి కాదు, యక్షిణి!

Posted: 12 Mar 2015 09:09 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
తాటక ఒక యక్షిణి అంటుంది రామాయణం. అంటే, యక్షుల తెగకు చెందినది. యక్షులు చారిత్రకత కలిగిన తెగ. తెలుగులో 'జక్కులు' అనే మాట, యక్షశబ్దానికి వికృతి. 'జక్క పురంధ్రి' అనే ప్రయోగం 'క్రీడాభిరామం'లో కాబోలు, ఉంది. యక్షప్రశ్నలు అనే మాట యక్షులనుంచే పుట్టింది. అడవిని ఆశ్రయించుకుని ఉండే యక్షులు దారినపోయేవారిని అటకాయించి, యక్షప్రశ్నలు వేసి, వారు జవాబు చెప్పలేకపోతే బలి ఇచ్చేవారట. బుద్ధుడు ఇలాగే తనకు తారసపడిన యక్షులలో ఉపదేశం ద్... పూర్తిటపా చదవండి...

కోయదొర

Posted: 12 Mar 2015 07:47 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం: కోయదొర  కృతజ్ఞతతో జీవించు

Posted: 12 Mar 2015 07:06 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం


ఏదైనా కోల్పోతామేమోనన్న భయమే మనకు ఎన్నింటినో దూరం చేస్తుంది. అందుకే జీవితంలో ఎదురయ్యే ఎన్నో  గొప్ప అవకాశాలను మనం దూరం చేసుకుంటాం. 

నిజానికి మన చెంతకు వచ్చే ప్రతి అవకాశమూ మనం ఊహించని ఎన్నో ప్రయోజనాలను ... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 12 Mar 2015 06:46 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
1-24.jpg
10.1-274-కంద పద్యము పూర్తిటపా చదవండి...

వర్ణోత్పత్తి - శ్రీవల్లభ.

Posted: 12 Mar 2015 06:43 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం

12.కఠోపనిషత్తు

Posted: 12 Mar 2015 06:30 PM PDT

రచన : Telugu astrology parakrijaya | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA
|| కఠోపనిషత్తు ||
శాంతిపాఠం :
ఓం సహనావవతు ! సహనౌభువక్తు ! సహవీర్యం కరవావహై !
తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై !!
ఓం శాంతి: శాంతి: శాంతి:

కఠోపనిషత్తు ప్రథమవల్లి :
1. ఓం ఉశన్ హ వై వాజశ్రవస: సర్వవేదసం దదౌ !
తస్య హ నచికేతా నామ పుత్ర ఆస !!
స్వర్గ ఫలాలను కోరి వాజశ్రవసుడు ఒక యుగంలో తన ఆస్తినంతటిని దానం చేశాడు. అతనికి నచికేతుడనే పేరు... పూర్తిటపా చదవండి...

చెత్తకుండి భద్రం!

Posted: 12 Mar 2015 05:51 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
చెత్తకుండీల్లో చేరే ఎలకలూ పందికొక్కులగురించి కాదీ కథ. చెత్తకుండీల్లో ఇళ్లల్లోవాళ్ళు పారేసిన చెత్త ఏరుకుని బతుకులు వెళ్ళదీసుకునే బడుగువారిగురించి చెప్తున్నా. నేను నిత్యా తిరిగేది పట్టుమని మూడు మైళ్ళు కూడా ఉండదు. ఆ పరిధిలోనే కనీసం ఇద్దరు ముగ్గుర్ని చూస్తాను కూరలబజారులో కనిపించే చక్రాలబండి తోసుకుంటూ. ఒకొక బండిలోనూ బండిఅంచుల వేలాడుతూనూ ఐదారు సంచులుంటాయి. వాళ్లలో ఒకమ్మాయిని నేను ప్రత్యేకంగా గమనిస్తున్నాను. యాదాలాపంగానే మొదలయినా, రాను రాను నాకుతూహలం మీరిపోతూ వచ్చింది. అప్పుడప్పుడు ఆ చెత్తకుండీల్లోంచి సగం […]పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger