Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 1 April 2015

జానకి దోసిట కెంపుల ప్రోవై ,, కలర్ పెన్సిల్ చిత్రం ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

జానకి దోసిట కెంపుల ప్రోవై ,, కలర్ పెన్సిల్ చిత్రం ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


జానకి దోసిట కెంపుల ప్రోవై ,, కలర్ పెన్సిల్ చిత్రం

Posted: 29 Mar 2015 07:02 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
IMG_NEW.jpg
జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపు రాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా శిరమున మెరిసిన
సీతారాముల కల్యాణం చూతము రారండీ ...
(బాపు గారి చిత్రం ఆధారంగా నేను వేసుకున్న కలర్ పెన్సిల్ చిత్రం)
... పూర్తిటపా చదవండి...

గజేంద్ర మోక్షము హరి కథ. శ్రీ వీరగంధం వేంకట సుబ్బారావు భాగవతార్.

Posted: 29 Mar 2015 06:33 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్

జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

తీర్ధయాత్రల వలన వర్ధిల్లు నఘము

Posted: 29 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తీర్ధయాత్రల వలన వర్ధిల్లు నఘము


తేటగీతి:
తీర్థ యాత్రల లో గూడ తిమ్మరాజు
మందు మానడు చెప్పినన్ మాట వినడు
" తీర్థ " మన్నది వెంటగా తెచ్చి జేయు
' తీర్ధ ' యాత్రల వలన వర్ధిల్లు నఘము
... పూర్తిటపా చదవండి...

సుదర్శన రగడ తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు (సవరించిన పాఠం)

Posted: 29 Mar 2015 03:57 PM PDT

రచన : మల్లిన నరసింహారావు | బ్లాగు : నరసింహ
ఆంధ్ర భారతి సైటు లోని పాఠం

 ఓంకారాక్షరయుక్తము చక్రము
సాంకమధ్యవలయాంతర చక్రము
సర్వఫలప్రదసహజము చక్రము
పూర్వకోణసంపూర్ణము చక్రము
హరవిరించి దివిజాశ్రయ చక్రము
గురుగతి రెండవకోణపుఁ జక్రము
స్రావనిశాచరసంఘము చక్రము
కోవిద తృతీయకోణపుఁ జక్రము
రణభయంకరవిరాజిత చక్రము
గుణయుతచతుర్థకోణపుఁ జక్రము
హుంకారరవమ(హో)గ్రపుఁ జక్రము
కొంకని పంచమ కోణపుఁ జక్రము
ఫట్కారపరబ్రహ్మము చక్రము
షట్కోణాంతవిశాలపుఁ జక్రము
బహళపటహరవభైరవ చక్రము
మిహిరతుహినకరమిళితము చక్రము
కఠినపవి నికరకల్పిత చక్ర... పూర్తిటపా చదవండి...

యవ్వనమూ – ముదిమీ… ఛార్ల్స్ కింగ్స్ లీ ఇంగ్లీషు కవి

Posted: 29 Mar 2015 02:13 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

కుర్రాడా! ప్రపంచం అంతా కొత్తగా ఉన్నప్పుడు
ప్రకృతి అంతా పచ్చగా కనిపిస్తున్నప్పుడు;
బాబూ! ప్రతి బాతూ హంసలాగానూ,
ప్రతి పిల్లా మహరాణిలానూ కనిపిస్తున్నప్పుడు;
బాలకా! అప్పుడు గుర్రాన్నీ బూటునీ వెతుక్కుని
దేశాటన చెయ్యడానికి పోవాలి;
పిల్లడా! యువరక్తం దాని దారి అది వెతుక్కోవాలి,
ప్రతి జీవికీ దాని రోజంటూ ఒకటి ఉంటుంది.

కుర్రాడా! ప్రపంచం అంతా పాతబడిపోయినప్పుడు
చెట్లన్నీ పచ్చదాన్ని కోల్పోయినపుడు;
బాబూ! ఏ క్రీడలోనూ ఉత్సాహం దొరకనప్పుడు
బండి చక్రాలన్నీ అరిగిపోయినప్పుడు;
ఇంటికి మెల్లగా చేరుకో; జీవితంలో అలిసి
చేవలుడిగిన వారిలో నీ... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 29 Mar 2015 01:28 PM PDT

రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : శ్రీ లలితా త్రిపుర సుందరి
రామాయణం

శ్రీరామ చరిత్రం పరమ పవిత్రం , పాపాలను నశింపజేస్తుంది, పుణ్యం సమకూర్చి పెడుతుంది. ఇది వేదంతో సమానము. రామాయణ  గానం ఆయుర్ధాన్ని పెంపోదిస్తుంది. రామాయణం పఠించే వారు పుత్ర పౌత్రాదులతో. దాస దాసీ జనులతో స్వర్గ సుఖం అనుభవిస్తారు. మరణానంతరం దేవతలచే పూజింపబడుతారు.

రామాయణాన్ని బ్రాహ్మణులు పఠ... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 864

Posted: 29 Mar 2015 01:18 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
10968562_394452804068638_746132996599527
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger