Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 23 June 2015

ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం

Posted: 22 Jun 2015 11:43 PM PDT

రచన : Suresh Kumar Digumarthi | బ్లాగు : Singing in the Train
http://chirb.it/yArD3d

ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం

ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం

గుండె బరువంత – గొప్ప పులకింత

... పూర్తిటపా చదవండి...

దీపం

Posted: 22 Jun 2015 11:30 PM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
వెలిగించిన దీపం చుట్టూ గుండ్రటి కాంతి సరస్సు

నువ్వు లేవు కనుక
సరస్సులో నా ముఖాన్ని చూసుకుంటాను
ఎవరో వొదిలి వెళ్ళిన నీడలను జాగ్రత్తగా తాకుతాను. ఎందుకో నవ్వుకుంటాను

గుమ్మానికి అవతలగా చెమ్మగిల్లిన రాత్రి.
రాత్రికి అవతలగా నేను రాసుకునే, నీకు ఎన్నటికీ చేరలేని లేఖలు.
అలల్ని చెరిపే ఈ గాలి, నా ఎదురు చూపులను తాకలేదు. నా శ్వాసను వినలేదు-
అందుకే - ఇక, నువ్వు లేవు కనుక

వెలిగించిన దీపం చుట్టూ ఉన్న
వలయపు ద్వారాలలోంచి, నీకు ఎన్నడూ తెలియని లోకాలలోకి
నెమ్మదిగా వెళ్ళిపోతాను నేను !
... పూర్తిటపా చదవండి...

ఇతి ఉపదేశః (సూక్ష్మ కథ)

Posted: 22 Jun 2015 11:20 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
surgical-mask-kiss-655x3331.jpg
"దయ్యము ఒక భయము... పూర్తిటపా చదవండి...

మానసబోధ 15 - 25

Posted: 22 Jun 2015 11:20 PM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
మానసబోధ 16 - 25
16. బలహీనుడను నేను
     అని తలంచుచు నీవు
    పరితపించెదవేల మనసా
          శక్తులన్నియు నీలోనే
          కలవంచు భావించి
         ధైర్యమును చేబట్టు మనసా

17. జన్మంబు లన్నిటిలో
      నరజన్మ శ్రేష్ఠమని
     చక్కగా నెరుగుము మనసా
        దైవభావము గలిగి
       మనుజత్వ మంతను
      సార్థకంబుగ జేయి మనసా

18. శాస్త్రాల సారము
      వివరించి తెలిపెద
     శ్రద్ధగా వినుము ఓ మనసా
        పరహితమె పుణ్యము
       పరపీడ పాప... పూర్తిటపా చదవండి...

సానెట్ 33… షేక్స్పియర్

Posted: 22 Jun 2015 10:58 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఇది షేక్స్పియర్ 400 వర్థంతి సంవత్సరము

నేను చెప్పలేనన్ని అద్భుత సూర్యోదయాల్ని చూశాను

మహోన్నత గిరిశృంగాలని రాజమకుటాలుగా రూపిస్తూ,

చిలకపచ్చని మైదానాలని పసిడి కాంతులతో ముద్దాడుతూ,

కళతప్పిన సెలయేళ్ళకు మహత్తరమైన దివ్య రుచులద్దుతూ;

అంతలోనే నిరాధారమైన నీలిమేఘాలు కూడబలుక్కుని

రోదసి రారాజు దివ్యవదనానికి అడ్డుగా తెరకట్టి

ప్రపంచానికి అతని వదనాన్నీ, వెలుగులని దూరం చేస్తే

పడమటకి అవమానభారంతో తను ఒంటరిగా క్రుంగడమూ తెలుసు;

అయినప్పటికీ నా సూర్యుడు ఒక రోజు ఉదయాన్నే

తన పూర్వ దీధుతులతో నా నుదుటన... పూర్తిటపా చదవండి...

                                              పాల పుంత వైపు  నా ప్రయాణం (పార్ట్ 1)ఆరు బయట ఆకాశం క్రింద...

Posted: 22 Jun 2015 08:10 PM PDT

రచన : జలసూత్రం చంద్రశేఖర్ | బ్లాగు : టూకీగా
                                              పాల పుంత వైపు  నా ప్రయాణం (పార్ట్ 1)

ఆరు బయట ఆకాశం క్రింద కూర్చొని చుక్కలు లెక్కపెట్టడం మన చిన్నతనపు సరదా . చంద్రుడు మనకు రోజూ కనిపించక పోయినా నక్షత్రాలు మాత్రం రోజూ పలకరిస్తాయి.  ఒకరకంగా మనకు వాటితోనే అనుభంధం ఎక్కువ.  ఇలాంటి నక్షత్రాలు వందలు, వేలు , లక్షల్లో దర్సనమిస్తే ? ఆ ఊహే నన్ను పాలపుంత వైపు నడిపించింది.  మరి పాలపుంత ను వెతుకుతూ నా ప్రయాణం ఎలా సాగిందో మీరు వివరించే ప్రయత్నమే ఇది.

 మనం ఉన్న గాలక్సీ ని పాలపుంత లేదా మిల్కీ వే అంటారని మనకు తెలుసు. పాలపుంత  గురించి నేను చాల చదివాన... పూర్తిటపా చదవండి...

పుష్కరాల్లో నగర పండితుల ప్రవచనాలు

Posted: 22 Jun 2015 06:54 PM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
11223641_696468967143327_909570603147501

... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-అల్లుని మంచితనంబును……

Posted: 22 Jun 2015 06:06 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
అల్లుని మంచితనంబును…………. అల్లుని మంచిదనంబును గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ! అల్లుడు మంచివాడయి ఉండటం, గొల్లవానికి సాహిత్యం తెలిసి ఉండటం, ఆడవారు నిజం చెప్పడం, వడ్లు దంచితే పొల్లు లేకుండా బియ్యం దొరకడం, తెల్లగా ఉండే కాకులూ లేవు అన్నారు, బద్దెన. అల్లుడు … చదవడం కొనసాగించండి → పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger