Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 7 May 2016

గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో.

Posted: 06 May 2016 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో.



కందము: 
వేడుచు తలిదండ్రులనే
'స్పీడుగ' నే తిరుగలేను శిఖి వాహనుతోన్
'ఐడియ ' నిమ్మని - " వినరా<... పూర్తిటపా చదవండి...

కాసుల ప్రతాప రెడ్డి గారి కవిస్వరమై నా కవిత: "లోపలి చూపు"

Posted: 06 May 2016 04:11 PM PDT

రచన : మరువం ఉష | బ్లాగు : మరువం
ఆత్మను పిడికిట పట్టుకుని లోలోతుల్లోకి పయనిస్తూ అనుభవాలను, అనుభూతులను నెమరేసుకుంటూ సాగిన కవిత ఉష రాసిన లోపలి చూపు. ఆత్మానుభూతిని అల్పక్షరాల్లో వ్యక్తీకరించి పాఠకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుందీ కవిత. ఇల్లు కేవలం ఓ భౌతిక రూపం కాదనే ఎరుకను కలగజేస్తుంది. ఇంటి చుట్టూ, ఇంట్లోనూ మన జీవితం పరుచుకుని ఉంటుంది. జీవన యానంలో ముందుకు నడిచిన తర్వాత గతంలోని పలు విషయాలు, సంఘటనలు గుర్తుకు వచ్చినప్పుడు పొందే అనుభూతిని కేవలం భౌతిక విషయంగా కాకుండా లోలోతుల్లోని ఆత్మ తండ్లాటగా ఆమె ఈ కవితను తీర్చిదిద్దారు. ఇల్లును దర్శించడానికి ఆమె ఆత్మ కిటికీ తెర... పూర్తిటపా చదవండి...

సేవ… రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి

Posted: 06 May 2016 03:03 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(ఈ రోజు రాబర్ట్ బ్రౌనింగ్ 205 వ జన్మదినం.)

 

అన్ని సేవలూ భగవంతుని దృష్టిలో సమానమే
ఇప్పుడు నడిచినా, ఒకప్పుడు నడిచినా
అతను మన నేలమీద నడిస్తే స్వర్గమే.
మనందరం అతనెలా అనుకుంటే అలాగే పనిచెయ్యగలం
మనలో గొప్పవాళ్ళైనా, నీచులైనా తోలుబొమ్మలమే
ఇందులో ఒకరు ఉత్తములూ, ఒకరు అధములూ లేరు.

"చిన్న సంఘటన" అనొద్దు. "చిన్న" దేమి?
ఇంతకంటే ఎక్కువ బాధ కలగాలా?
ఇంతకంటే ఏదో పెద్ద సంఘటన జరగాలన్నట్టు?
ప్రభూ! జీవితంగా చుట్టుకునే
కర్మల దారపు కండెనుండి వేరు చెయ్యి.
ప్ర... పూర్తిటపా చదవండి...

ఖండకావ్యము - 20

Posted: 06 May 2016 11:33 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
భోజరాజు వింత కోరిక
రచన : కంది శంకరయ్య

భోజరాజున కొకనాఁడు పొడమె నొక్క
వింత కోరిక, "నే మరణింతు నేని
యెట్లు స్పందింతు?" వనుచు ప్రశ్నించెఁ గాళి
దాసు; నది విని వెఱగంది "తప్పు గాదె
యిట్లు మాటాడ, నే నిప్పు డిట్టి శ్లోక
మొక్కటైనను విన్పించ నొప్ప" ననెను;
కనలి యారాజు "నామాట గౌరవింప
కిట్లు రాజాజ్ఞధిక్కార మెంతొ చేసి
నాఁడ, విపుడె నా రాజ్యము వీడు" మనఁగ,
వెడలె తనయ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger