లెక్క తప్పుతోంది. నీకీ వయసులో లెక్కలేంటయ్యా? అనకండి. లెక్క లెక్కే కదా! లెక్క ఎందుకూ? అన్నది మాట. నేను కూడబెట్టుకున్న ఆస్థులు,షేర్లు విలువ పెరిగిందా తరిగిందా? నిప్టీ లెక్కేసుకోడానికి కాదు. మరేంటి? ఉదయం ట్రేక్ మీద నడుస్తాను. ఎన్ని రౌండ్లు తిరిగాను? అదీ లెక్క! వేళ్ళు లెక్కెంటుకుంటే సరిపోయె! వేళ్ళు లెక్కేట్టేను, వేలి కణుపులు లెక్కెట్టేను. అబ్బే! నడుస్తుండగా, వేళ్ళు ముడవడం మరవడమో, కణుపులు లెక్క ముందుకా వెనక్కా! సందేహం రావడం, ఇలా లెక్క తప్పుతోంది. ఏం చేయాలి? సెల్ పోన్ పట్టుకెళ్ళి స్టాప్ వాచ్ లో రౌండ్లు లెక్కేసేను. ఇందులో కూడా రౌండు అయ్యాకా నొక్కేనా? లేదా? సందేహం! ఇలాగా లెక్కతప్పుతోంది. అసలు రౌండ్లు లెక్కెందుకూ? పది రౌండులైతే నాలుగు కీలో మీటర్లు నడచినట్టు! అదీ సంగతి. ఏం చేయాలో తోచలేదు, ఇలా పడుతూ లేస్తూ, లెక్కతప్పుతూ నడుస్తూనే ఉన్నా రోజూ! ఓ రోజు నడుస్తుండగా, హటాత్తుగా మెరుపు ఆలోచనొచ్చింది. ఉదయం నడకలో బలే బలే ఆలోచనలొస్తాయి, బుర్రొంచుకు నడుస్తుంటే! ఈ ఆలోచనలన్నీ కొద్ది సేపటికే ఆవిరైపోతాయి. కొన్ని మాత్రమే బతికి బట్టకడతాయి. అటువంటివే ఇక్కడ కంప్యూటరుకి ఎక్కుతాయి. ఈ సొదెందుకుగాని ఏం చేసేవో చెబుదూ అని సెలవా! ఆలోచనొచ్చిన దగ్గరే వంగున్నా, చిన్న చిన్న రాళ్ళు ఏరుకున్నా! కూడా ఉన్నవాళ్ళడిగేరు. రాళ్ళుందుకూ? చెప్పేను. నవ్వుకున్నారు. నవ్వుకోండి నాకేం! ఏదో ఒక రోజు మీకూ ఈ అవస్థ తప్పకపోవచ్చని మనసులో అనుకున్నా! ఒక్కో రౌండుకి ఒక్కో రాయి పారేస్తూ వచ్చా! చివరికి చెయ్యి ఖాళీ అయింది, రౌండ్ల లెక్క సరిపోయింది, కాళ్ళూ పీకేయి :) లోకో భిన్నరుఛిః లోకంకదా! నవ్వుతారు. నవ్వేరని మనపని మానుకుంటామా? మనిషి నోరు మూయడానికి మూకుడుందిగాని,లోకం నోరు మూయడానికి మూకుడు లేదు, ఇదో నానుడి.
Post Date: Fri, 07 Jul 2023 03:22:03 +0000
పూర్తి టపా చదవండి.. ---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782