Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 30 January 2023

ఉత్పలమాలలో మరో రెండు పద్యాలు - ఏ.వి.రమణరాజు

ఉత్పలమాలలో మరో రెండు పద్యాలు సాహితీమిత్రులారా! తెలుగువెలుగులో రామన మాస్టర్, బెంగుళూరు వారు కూర్చిన గీతకందగర్భ ఉత్పలమాల గమనించండి- ఉ. మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లునే ఈ ఉత్పలమాలనుండి ఒక తేటగీతిని విడదీస్తే. మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న , యీ మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ , తా నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లు నే తే. వరము మాకిల తీయని భాష యన్న పలుకు మాటలు తేనెల పాలవెల్లి ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ తెలుగు నేలల మానుడి తేజరిల్లు ఆ ఉత్పలమాలలో ఒక కందము కూడా దాగుంది మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లునే . కం. తెలుగే కదా వరము మా కిల తీయని భాషయన్న యీ మా తెలుగే తెలుగందు మా ఘనత కై తల కన్నియ కాంతులెన్నొ తానె తలపై
Post Date: Mon, 30 Jan 2023 14:14:22 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

సమస్య - 4223 - కంది శంకరయ్య

31-1-2023 (మంగళవారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... "కామమును గోపమే కదా కామ్యము లిడు" (లేదా...) "కామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా" (జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో శ్రవణ్ కుమార్ గారి సమస్య)
Post Date: Mon, 30 Jan 2023 15:29:51 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

ఘంటసాల పాటల "కందాలు" - 16 - గోలి హనుమచ్చాస్త్రి

కందము: టాటా వీడ్కోలనుచును వాటముగా ముద్దగాను పాడిన విధమే నాటో నీటో వేయుచు మాటలు మాటాడినట్టి మాదిరి తోచున్.
Post Date: Mon, 30 Jan 2023 01:43:25 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

ధర్మం - గోలి హనుమచ్చాస్త్రి

ధర్మంగా కూడబెట్టు ధర్మంకోసం కూడగట్టు ధర్మమంటూ కూడుబెట్టు.
Post Date: Mon, 30 Jan 2023 02:53:06 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

సమస్య - 4222 - కంది శంకరయ్య

30-1-2023 (సోమవారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... "రమ్ముఁ దెచ్చె హనుమ రామున కని" (లేదా...) "రమ్మునుఁ దెచ్చె మారుతియె రామునకై ముదమంద వానరుల్" (జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ముదిగలం బాబు గారి సమస్య)
Post Date: Sun, 29 Jan 2023 15:29:31 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

Sunday, 29 January 2023

చేతకాని మొగుడు కంటే - sarma

చేతకాని మొగుడు కంటే చెడ్డ మొగుడు మేలు. ఇదొక నానుడి మొగుడు గురించి పెళ్ళానికంటే బాగా చెప్పగలవారు మరొకరుండరు. మొగుడు మగాడితనం   పెళ్ళా నికి కాక మరొకరికి తెలిసే సావకాశం తక్కువ.  మొగుడు ఎంత  మొ నగాడో మొదటి మూడు రోజుల్లోనే చెప్పగలదు, పెళ్ళాం. '' చేతకాని మగడు మంచానికి అడ్డని'' ఒక నానుడి. చేతకాని తనానికి నిర్వచనం చెప్పడం తేలికైన పనికాదు. చేయవలసిన పని,  చేయవలసిన సమయంలొ, పలకవలసిన మాట పలకవలసిన‌ సమయంలో పలకక పోవడమే, చేయక‌/చేయలేకపోవడమే చేతకాని తనం. ఇటువంటివానితో సంసారం చేయడం నరక ప్రాయమని అతివలంటారు, నిజం కూడా. వీటికి మూర్ఖత్వం అదనమై ఉంటుంది, తెలివితక్కువ జోడింపు. ఇక చెడ్డ మగడంటే తెలివైనవాడేగాని మూర్ఖత్వంలో తీసిపోడు. ''మంచం మీదున్నంతసేపు మొగుడేగాని దిగితే యముడ''న్న‌ నానుడికి తీసిపోడు. చెప్పిన మాట వినిపించుకోడు,కాదు వినడు. ఇటువంటి మగనితోనూ కాపరం నరకమేనంటారు, అతివలు. చేతకాని మగనికంటే చెడ్డమగడెలా మేలన్నదికదా ప్రశ్న.  చేతకానిమగడు,చెడ్డమగడూ కూడా చెప్పినమాట వినరు. కాని చెడ్డమగడు, చెప్పగా చెప్పగా ఎప్పటికైనా వినే సావకాశం ఉంది. చేతకాని మగడు విన్నా ఉపయోగం లేదు,ఏమీ చేయలేడు గనక. చెడ్డమగడు పెళ్ళాం మాట వినడం మొదలెడితే ఆ సంసారం స్వర్గమే!!! అందుకని చేతకాని మగనికంటే చెడ్డమగడే మేలు.
Post Date: Sun, 29 Jan 2023 03:16:02 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

Saturday, 28 January 2023

సమస్య - 4221 - కంది శంకరయ్య

29-1-2023 (ఆదివారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... "పాడ నేర్పుమనుచు పాము లడిగె" (లేదా...) "పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్" (జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ఆర్. కళ్యాణి గారి సమస్య)
Post Date: Sat, 28 Jan 2023 15:29:50 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

Friday, 27 January 2023

సమస్య - 4220 - కంది శంకరయ్య

28-1-2023 (శనివారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... "కోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్" (లేదా...) "కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో" (జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో కలికిరి గురుదేవ్ గారి సమస్య)
Post Date: Fri, 27 Jan 2023 15:29:30 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

షడర చక్రబంధం - ఏ.వి.రమణరాజు

షడర చక్రబంధం సాహితీమిత్రులారా! గణపవరపు వేంకటకవి కృత శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము లోని షడర చక్రబంధం ఇది - శార్దూలవిక్రీడితవృత్తం సత్యాకల్పక ప్రస్ఫుటా శరభిదాచారా విశంక క్రమా మత్యావిష్కృత బంధురాదరణ భూమాజన్తు కూటాశ్రితా దిత్యావేంధన ధర్మసారతరమూర్తీముత్కరాద్రిక్షమా మాత్యుల్లాసపదా మహావిదితధామా సాధుతారక్షమా -861 అర్థం:- సత్యాకల్పక=సత్యభామపాలిటి కల్పవృక్షమా!(సత్యకు పారిజాతకల్పవృక్షాన్ని తెచ్చిఇచ్చిన కల్పవృక్షం), శరభిదాచార=బాణాలతో భేదిల్లజేయడం అనే విద్యలో, విశంకక్రమా=నిశ్శంకం,నిరాటంకంఅయిన పరాక్రమం/విజృంభణం కలిగినవాడా!,మతి+ఆవిష్కృత=అంతరంగం(మది)లోఆవిష్కృతం అయినవాడా!, బంధురాదరణభూమా=అపారంగా ఆదరించేబుద్ధి కలవాడా!, జంతుకూట+ఆశ్రిత=ప్రాణి(పశు)సమూహంచేత ఆశ్రయించబడినవాడా!, దిత్యావేంధన=దితి కుమారులయిన రాక్షసదుర్మార్గులను  అగ్నిలా దహించేవాడా!, ధర్మ సార రత మూర్తీ=వేదధర్మంపట్లగాఢాభినివేశంకలవాడా (ధర్మస్వరూపా!), ముత్+కర=ఆనందదాయకమూ,అద్రి=పర్వతంలా నిశ్చలమూఐన,క్షమా=తాలిమికలవాడా!,మా=లక్ష్మీదేవికి, అత్యుల్లాస=బాగా ఉల్లాసం కలిగించేవాడా, మహావిదిత=బాగ గొప్పగా ప్రసిద్ధికెక్కినవాడా!, ధామా=నివాసం/కాంతికలవాడా!(శ్రీహరిధామంగాతిరుమల సుప్రసిద్ధం), సాధుతారక్షమా=సజ్జనులను తరింపచేయడంలో సమర్థుడా! భావం:- సత్యభామపాలిటికల్పవృక్షమా!బాణవిద్యలో ఆరితేరినవాడా! తలచేవారి మదిలో మెదిలేవాడా!అపారదయామయా!ప్రాణులచేత ఆశ్రయించబడినవాడా!దుష్టంలయిన రాక్షసులను దహించేవాడా!ధర్మస్వరూపా!ఆనంద దాయకా! కొండన్నా! సిరికి ఉల్లాసం కలిగించేవాడా!సంప్రసిద్ధమైన తిరుమలవాసా! సజ్జన సంరక్షకా! *విశేషాలు:-* నరశార్దూలస్మరణశార్దూలవృత్తంలోచేయడం సముచితం.చక్రధారిస్తుతి షడరచక్రబంధంలోచేయడం బాగు. ఈ బంధచిత్రంలో వెలుపలనుంచి మూడవవలయంలో- *కవి వేంకటాద్రి అనీ,  ఆరవవలయంలో ప్రబంధరాజము* అనీ  కవిపేరూ కావ్యంపేరూ ఉంది. ఈ పద్యానికి ఇదివరలో అర్థతాత్పర్యాలు లేవు. వేదంవారి సంపాదకత్వ1977ప్రతిలో పద్యం మొదటిపాదంలో ప్రస్ఫుట బదులు 'పస్పుట' అని అచ్చుతప్పు.బంధచిత్రంలో ఆరవ వలయంలో కావ్యంపేరులోని మొదటి అక్షరం *ప* అని ముద్రితం కావడం సంపాదకుల నిర్లక్ష్యానికి పతాక. మిగతా చోట్ల అచ్చుతప్పులు కొల్లలు.కనీసం కావ్యంపేరైనా సరిగా పరిశీలించని సంపాదకత్వం.   పద్యంలోని మూడవపాదం ప్రారంభంలో  *దిత్యావేంధన* అనే పాఠాన్ని *దిత్యౌఘేంధక* వ్యాకరణ పండితులు సవ రించినారు. అలా సవరించడంవల్ల బంధచిత్రం మూడవ వలయంలో  *కవిఘేంకటాద్రి* అని ఏర్పడి కవిపేరుకు భంగం వాటిల్లుతుంది. అది పరిశీలించక వ్యాకరణపండితులు రసజ్ఞతను వదలి వస్త్రమూల్య విచారణ చేసినారని తెలుపడా నికి బాధగా ఉంది.      పద్యంలోని మూడవపాదంలో *జంతు* అనే పదం ఉంది.ఆ పదంలోని *జ* అక్షరంబంధ చిత్రంలో కావ్య నామాన్నిసూచించే ఆరవవలయంలోని  *ప్రబంధరాజము* లో *జ* . కనుక జంతు పదాన్ని జన్తు అని రాయడం జరిగింది. వేంకటాద్రీశా!గోవిందా!గోవింద! వైద్యంవేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంత
Post Date: Fri, 27 Jan 2023 14:12:35 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

మొగుడు ముండా అంటే - sarma

మొగుడు ముండా అంటే మాదాకవళం వాడూ ముండా అంటాడు. ఇదిఒక నానుడి. ఒక కత చెప్పుకుందాం అనగనగా ఒక పల్లెటూరు. ఆఊళ్ళో ఒక కుటుంబం, భార్య,భర్త, వారికొకడేకొడుకు.ఇలా ఉం డగా భర్త కాలం చేయడంతో,పిల్లవాణ్ణి పెంచుకుంటూ కాలక్షేపం చేస్తూ వచ్చిందా ముసలమ్మ.  కొడుకు ప్రయోజకుడు కాలేకపోయాడు, చదువు సంధ్యలూ అంతంత మాత్రమే అయ్యాయి.  కొడుకు పెద్దాడయ్యాకా ఒక పడుచును చూసి పెళ్ళిచేసింది.  పెళ్ళైన తరవాతగాని మొగుడి నిరవాకం తెలియని పడుచు, చేతకాని మొగుడుకంటే చెడ్డమొగుడే మేలు, ఏం చెయ్యగలనిప్పుడనుకుని సంసారం గుట్టుగా నడుపుకొస్తూ ఉంది. ఒక రోజొక మాదాకవళం వాడు గుమ్మం దగ్గర అరుస్తున్నాడు, ''మాదాకవళం తల్లీ'' అని.  భర్త భోజనం చేస్తున్నాడు, చివరికొచ్చేసింది, ''మళ్ళీ రా'' అనడం ఇష్టం లేక ఆ పడుచు ''ఒక నిమిషం ఉండూ'' అని అరిచింది. ఐనా వాడు అరుస్తూనే ఉన్నాడు. ఆమె భోజనం కానందున సద్దుకోవడానికి కొంచం సమయం పట్టింది.    భోజనం  చేసి బయటికి వెళ్ళిన ఇతను   "ఒసే! ముండా ఎంతసేపుండాలే వీడూ"అనరిచాడు లోపలికి. పాపమా పడుచు మాదాకవళం తెచ్చి,   మాదాకవళం వాడిజోలెలో వేసింది, మరో మాట మాటాడక. మరో నాలుగు రోజుల తరవాత కూడా అలాగే జరిగింది. ఆ తరవాత మాదాకవళం వాడే ''ముండా! ఎంతసేపు ఉండాలే'' అని అరచాడు. పడుచు మాటాడలేదు, జోలెలో కవళం వేసి వెళ్ళిపోయింది, లోనికి. ఇప్పుడు అతని తల్లి కలగసేసుకుని, నువ్వు రెండు సార్లు నీ భార్యను ముండా అని మాదాకవళం వాడి ముందంటే , మాదాకవళాని కొచ్చినవాడూ ముండా అన్నాడు, చూసావా! నీకు నీ భార్య మీద పైచెయ్యి సాధించాలంటే ఇది పద్ధతి కాదు,నీకూ నీ భార్యకూ తేడాపాడాలుంటే నాలుగు గోడల మధ్యన తేల్చుకో వీధినకాదు. వాడు ఈ రోజు నీ భార్యను ముండా అన్నాడు, రేపు నిన్నూ తిడతాడు, ఆపై నన్నూ తిడతాడు.  ముష్టివాడు తిడితే నీ పెళ్ళానికొచ్చిన లోటేం లేదు,నీ పరువే పోయింది. కాని ఇది పదిమందికీ తెలిసి నీ చేతకానితనమే బయట పడింది. గడ్డిపోచ విలువ చెయ్యని ముష్టివాడికిచ్చిన పాటి విలువ,గౌరవం, నీ భార్యకివ్వలేక పోయావు.  నీకు తెలివితేటలెప్పటికొస్తాయో! నీకు వయసు పెరిగిందికాని బుద్ధి పెరగలేదని తిట్టింది.
Post Date: Fri, 27 Jan 2023 03:25:46 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger