Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 4 August 2022

ఇంత పురాతన శిల్ప సంపద అంతర్జాతీయ మార్కెట్ లోకి వెళుతోందా..? - Unknown

భారత దేశం పురాతన శిల్పాలకి,కళా రూపాలకి పెట్టింది పేరు. ఇత్తడి తోనూ,రాతి తోనూ ఇంకా ఇతర లోహాల తోనూ చేసిన అనేక శిల్పాలు అంతర్జాతీయ విపణి వీధి లోకి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ కాబడుతున్నాయి.1950 నుంచి ఇప్పటి దాకా10,000 ల నుంచి 20,000 ల పురాతన శిల్పాలు దేశం దాటించబడ్డాయని ఒక పరిశోధన తేల్చింది. 2010 నుంచి 2012 మధ్య కాలం లొనే రమారమి 15000 పురావస్తువులు స్మగ్లర్లు బారిన పడి దేశాన్ని దాటాయి. ఒక్క తమిళనాడు నుంచే 12000 ల శిల్పాలు ఈ లిస్టు లో చేరాయి.కఠినమైన చట్టాలు కూడా లేకపోవడం కూడా స్మగ్లర్లకి కలిసివస్తున్నది.హెరిటేజ్ తెఫ్ట్ IPC370 అనే ఒక్క చట్టమే ఈ విలువైన వస్తువుల్ని బయటకి పంపించేవారిపై ప్రయోగిస్తున్నారు.అమెరికా ఇలాంటి వస్తువుల్ని సేకరించడం లో,మార్కెటింగ్ లో ముందు వరుసలో ఉండగా ఆ తర్వాత యు.కె. రెండవ స్థానం లో ఉంది.ప్రస్తుతం ఆస్ట్రేలియా కూడా పెద్ద మార్కెట్ గా ఉన్నది. పోయిన పురాతన శిల్ప సంపదని సమ్రక్షించుకోవడం లో ఇటలీ ముందు స్థానం లో నిలుస్తున్నది. 6,78,000 వస్తువుల్ని వెనక్కి రప్పించగలిగింది.అదే ఇండియా విషయానికి వస్తే 2012 నుంచి ఇప్పటిదాకా 127 వస్తువుల్ని వెనక్కి తీసుకురాగలిగింది.సుభాష్ కపూర్ అనే బడా స్మగ్లర్ కి చెందిన గోదాముల్లో 100 మిలియన్ డాలర్ల విలువైన పురాతన వస్తు సంచయాన్ని అమెరికా పొలీసులు ఆ దేశం లో సీజ్ చేశారు.ఇంకా దురదృష్టం ఏమిటంటే మనదేశం లోని పద్మ అవార్డులు పొందిన వారు సైతం ఇలాంటి విలువైన వస్తువుల్ని విదేశాలకి పంపించడం లో కీలకపాత్ర పోషించడం.సింగపూర్ కి చెందిన ఎస్.విజయ కుమార్ అనే పరిశోధకుడు ఐడల్ తెఫ్ట్ అనే తన గ్రంధం లో ఇలాంటి ఎన్నో సంగతులు తెలిపారు.
Post Date: Wed, 03 Aug 2022 22:37:09 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger