Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 23 November 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౮(688) - Aditya Srirambhatla

( నారాయణ‌ఋషి భాషణ ) 11-72-ససీ. నవ వికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ- గగనచరనది జనిత! నిగమవినుత! జలధిసుత కుచకలశ లలిత మృగమద రుచిర- పరిమళిత నిజహృదయ! ధరణిభరణ! ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ!- కటిఘటిత రుచిరతర కనకవసన! భుజగరిపు వరగమన! రజతగిరిపతివినుత!- సతతజపరత! నియమసరణి చరిత! 11-72.1-తే. తిమి, కమఠ, కిటి, నృహరి, ముదిత బలి నిహి త పద, పరశుధర, దశవదన విదళన, మురదమన, కలికలుష సుముదపహరణ! కరివరద! ముని నర సుర గరుడ వినుత! భావము: "నవవికసిత పద్మములవంటి కన్నుల జంట కలవాడ! హరి! పాదము మూలము లందు ఆకాశగంగ పుట్టినవాడ! వేదములచేత పొగడబడు వాడ! లక్ష్మీదేవి యొక్క కలశముల వంటి వక్షోజాలకు అలరుతుండెడి కస్తూరి పరిమళాలు అంటిన హృదయం కలవాడ! భూమిని మోసిన వాడ! బ్రహ్మదేవుడు మున్నగు దేవతలు సంస్తుతించు వాడ! నడుము నందు బంగారచేలము ధరించినవాడ! గరుత్మంతుడు వాహనముగా కలవాడ! కైలాసపతి శంకరునిచే నుతింపబడు వాడ! నిరంతర జపం చేసే వారి యందు ఆసక్తి కలవాడ! నియమబద్ధమైన చరిత్ర కలవాడ! మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బలరామ, రామ, కృష్ణ, కల్కి అను దశావతారములను దాల్చినవాడ! గజేంద్రవరదా! మునులు నరులు సురలు గరుడులు మున్నగు వారిచే పొగడబడు వాడ!" http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=72 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Wed, 23 Nov 2022 15:48:50 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger