Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 30 December 2022

వ్యత్యస్త పాదారవింద. - sarma

వ్యత్యస్త పాదారవింద. వ్యత్యస్త పాదారవింద ఇందిరా హృదయానంద. ఎప్పుడేనా విన్నారా? ఇది భజనపాళీ లో పాడేది, అన్నటు నేడు వేల్పుల భజనలు లేవుగా తెరవేల్పుల భజనలే తప్పించి. :) వ్యత్యస్తం అంటే అపసవ్యంగా ఉండడం, అపసవ్య పదారవిందాలున్నవాడు.అంటే ఎడమపాదం కుడివైపు వేసుకుని ఒకపాదం మీద నిలబడి రెవండవకాలి బొటనవేలు భూమిమీద ఆనించి నిలవడడం. అబ్బే ఎంత చెప్పినా అర్ధం చెయ్యలేనేమో. కృష్ణుని బొమ్మ చూశారా? చూసేవుంటారు. నిలబడి ఉన్న కృష్ణుడు వ్యత్యస్తపాదాలతో, చేత మురళితో, వెనక గోవుతో,పొన్నచెట్టు నీడ నిలబడినట్టు ఉంటాయి. ఏమిటి దీని తిరకాసు? అసలు కృష్ణుడు అలాగే ఎందుకు నిలబడతాడు చెప్పండి? కొచ్చను. Courtesy:Google ఎడమకాలు ఎత్తి కుడికాలి మీంచి కుడి కాలి కుడి వైపు వేసి నిలబడగలరా? ప్రయత్నించద్దు, పడిపోతారు. ఇలా అడుగులేసి నిలబడటమే వ్యత్యస్త పాదాలు.ఇలా నిలబడటం చాలా కష్టం. యోగాలో దీనిని గరుడాసనం అంటారు.ఇలా నిలబడి రెండు చేతులూ పైకెత్తి మోచేతులనుంచి మెలిక వేసి రెండు అరచేతులూ నమస్కార ముద్ర పట్టడమే గరుడాసనం. ఎందుకిది పనిలేక అనికదా కొచ్చను. ఇలా నిలబడగలిగితే మనిషికి స్థిరత్వం కలుగుతుంది.మనిషి ఆలోచన కూడా సవ్యమైన దిశలో నడుస్తుంది. అబ్బే నమ్మం, చిత్తం తమకి నచ్చదని తెలుసు. :) మొన్నీ మధ్య నాసా అనుకుంటా ఒక అంతరిక్ష నౌకని పంపింది, అందులో ఒక అంతరిక్షిణి వెళ్ళింది. ఆ అంతరిక్షిణి తన ఖాళీ సమయంలో ఈ గరుడాసనం వేస్తూనిలబడిన ఫోటోలను నెట్ లో వైరల్ చేసేరు. ఆవిడకేం పనిలేక ఈ గరుడాసనం వేసిందా? కాదు అంతరిక్షంలో కూడా స్థిరంగా నిలవాలంటే ఈ గరుడాసనం ఉపయోగిస్తుందిష. ఇక వృక్షాసనం అని ఒకటుంది, ఇందులో ఒకకాలిపై నిలచి రెండవకాలు మొదటికాలి మోకాలి దగ్గర ఉంచి నిలవాలి, చేతులు పైకి చాచి నమస్కార ముద్ర పట్టాలి.. ప్రయత్నించద్దూ! పడిపోతారు. నాకే పూచీలేదు. ఇదీ నెట్ లో వైరల్. ఎందుకుషా? ఈ ఆసనం పదిసెకండ్లు వేసి నిలవలేనివారు పదేళ్ళలో పోతారూ, అని చెబుతున్నారు. మనవారేంచెబుతున్నారూ! సాధనమున పనులు సమకూరు ధరలోన, ప్రయత్నం చెయ్యండి, ఎంత సేపైనా నిలవగలరు, హాయిగా జీవించగలరు. ఇలా నిలిచి తపస్సు చేసిన మహానుభావులు ఎంతమందో, ఎంతకాలం తపస్సుచేసేరో ఎవరికెరుక? ఏది పాసిటివ్ తింకింగ్ బాబూ! పదేళ్ళలో చస్తావన్నదా???
Post Date: Fri, 30 Dec 2022 03:28:08 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger