ద్విపద కందగుప్తం సాహితీమిత్రాలారా! కందపద్యంలోనే ద్విపద గుప్తంగ ఉండే రచనను ద్విపదకందగుప్తం అంటారు.అంటే కందపద్యం ద్విపద లక్షణంకూడ కలిగిఉంటుంది. ఈ కింది కంద ద్విపద గణాది లక్షణాలను నిశితంగ పరిశీలిస్తే ద్విపద కందగుప్త రచనలో ఉండే కిటుకు తెలుస్తుంది. క.కలువలదొర మానికముల దళంపు తలపుల నెపుడును-దగలోగొనగన్ గల తరగల పాలకడలి చెలంగు చెలువుని నిను గొలి-చెద లోకమునన్ . పై కందంలో గుప్తమైన ద్విపద: కలువలదొరమాని-కములదళంపు తళుకులనెపుడును-దగ లో గొనగను గల తరగల పాల-కడలి చెలంగు చెలువుని నిను గొలి-చెదలోకమునన పై పద్యం గణపవరం వేంకటకవి రచించిన "ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసం"(143)లో ఉంది. వైద్యంవేంకటేశ్వరాచార్యులుగారి సౌజన్యంతో
Post Date: Wed, 11 Jan 2023 13:50:42 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Wed, 11 Jan 2023 13:50:42 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment