వేలం వెర్రి అనగనగా ఒక రాజ్యం, దానికో రాజు, మంత్రి. రాజుకో అనుమానం వచ్చి మంత్రిని అడిగాడిలా వేలం వెర్రి అంటే ఏంటీ? అని. దానికి మంత్రి రకరకాలుగా చెప్పేడుగాని రాజుకి సంతృప్తి కాలేదు. రాజా మీకో అనుభవం ద్వారా తెలియ జేస్తాను, నేను చెప్పినట్టు చేయాలని షరతు పెట్టేడు, రాజు ఒప్పుకున్నాడు. మరునాడు ఉదయమే రాజ అంగరక్షకులకు గుళ్ళు గీయించి కాషాయం కట్టించాడు, వస్త్రాలలో ఆయుధాలు దాచుకునేలా చేశాడు. రాజా మీరు కూడా సన్యాసిలా తయారవాలని చెప్పి గుండు గీయించి,కాషాయం కట్టించి, రహస్య సొరంగం ద్వారా ఊరికి ఒక పక్క ఉన్న ఆలయానికి చేర్చి, నెమ్మదిగా అడుగులేసుకుంటూ పట్టణం అవతలి వైపు ఆలయానికి చేరండి. ఇలా చేరడానికి సాయంత్రం అవుతుంది, అప్పుడు ఎవరూ చూడకుండా అక్కడి రహస్య సొరంగం ద్వారా కోటకి చేరమని చెప్పి పంపించాడు. రాజు సన్యాసి వేషంలో అంగరక్షకులు శిష్యుల వేషంలో నగరం వైపు నడుస్తున్నారు. సన్యాసిని చూసిన కొంతమంది నమస్కారం చేస్తున్నారు.పట్టణం దగ్గర పడుతుండగా నమస్కారాలు పెరిగాయి, నడక మందగించింది. ఈలోగా ఒక ప్రముఖుడు గుర్రం మీద పోతూ, సన్యాసిని చూసి, గుర్రందిగి అడ్డంగా పడుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది చూసిన కొందరు అలాగే చేశారు. పట్టణం మధ్యకి చేరేటప్పటికి మధ్యాహ్నమయింది. ఇక అక్కడి నుంచి, ప్రముఖులు చాలా మంది నడకకి అడ్డంగా సాష్టాంగ నమస్కారం చేయడం మొదలెట్టేరు. జనం విరగ బడ్డారు, నమస్కారాలు చేయడానికి, సన్యాసికి అడుగు తీసి అడుగు వేయడం కష్టమయింది. సూర్యాస్తమయానికి చచ్చిచెడి పట్టణం మరో వైపు గుడి చేరి,రాత్రికి కోట చేరేరు. మరునాడు ఉదయం మంత్రి అర్ధమయిందా రాజావారు అని అడుగగా, మన దేశంలో సన్యాసులకి ఇలా అడుగడుగునా నమస్కారాలు చేయడం కొత్త కాదని, చెప్పేడు. రాజుకి ప్రత్యక్షంగా అనుభవ చూపినా తెలియకపోవడంతో మరో ప్రయత్నం చేస్తానన్నాడు, మంత్రి. మరునాడు ఉదయానికి పగటి వేషగాళ్ళ ద్వారా రాజుకి అంగరక్షకులకి ఈ సారి గడ్డాలు మీసాలు, బవిరి జుట్టూ ఏర్పాటు చేసి, మరల రహస్య సొరంగంలో నుంచి పట్టణం చివరికి చేర్చి, ఈ సారి రాజునూ భటులనూ పట్టణం మధ్య రావి చెట్టు కింద తీనెపై కూచోవలసినదిగా చెప్పేడు. అలాగే రాజు పట్టణ మధ్య రావి చెట్టు చేరి, తీనె పై కూర్చున్నాడు, శిష్యులు చుట్టూ చేరి నిలిచారు. నమస్కారాలు పెడుతున్నారు ప్రజలు, శిష్యులు, ప్రజలని వరసలో పంపుతున్నారు స్వాములదగ్గరికి, ఇంతలో ఒక ప్రముఖుడు గుర్రం దిగి స్వామి దగ్గరకొచ్చి నమస్కారం చేసి, స్వామి తలపై ఒక వెంట్రుక పేకి కళ్ళకద్దుకుని పట్టుకుపోయాడు. ఆ తరవాత నుంచి అందరూ స్వామి తలపై ఒక వెంట్రుకా పీకుతూ, నమస్కారం చేస్తూ వెళుతున్నారు, ఇది స్వామి వేషం లో ఉన్న రాజుకి వింతగానే తోచింది, కాని ఏమీ చేయలేక బలవంతంగా కూచున్నాడు, సాయంత్రం దాకా. చివరికి సాయంత్రం అయింది.రాజు తలపై వెంట్రుకలూ పల్చబడ్డాయి, కాని జనం మిగిలిపోయారు, ఇప్పుడు శిష్యులు కలగజేసుకుని స్వామి నేటికి విశ్రమిస్తారు, రేపు రండని ప్రజలని పంపించి, ఊరి చివరి గుడి సొరంగం ద్వారా కోటకి చేరుకున్నారు. మర్నాడు మంత్రి కలిస్తే, ప్రజలు వెంట్రుకలెందుకు పీకారని, అడిగాడు.దానికి మంత్రి, రాజా! మొన్న మీకు నమస్కారాలు ప్రముఖుల సాస్టాంగ నమస్కారాలు నేను ఏర్పాటు చేసినవే! అప్పటిదాకా నమస్కారాలు పెట్టిన ప్రజలు, ప్రముఖులు సాస్టాంగ నమస్కారం చేస్తే ప్రజలూ అలాగే చేసేరు, తమరు అడుగు కదపడమే కష్టమయిందికదా! ఇక నిన్న కూడా నమస్కారాలతో మొదలయింది. ప్రముఖులు మీ తలపై వెంట్రుక పీకి కళ్ళకద్దుకుని నమస్కారం చేస్తే అంతా అలాగే చేసేరు. ఇదే వేలం వెర్రి అంటే! ఆ ప్రముఖుడు ఎందుకు చేశాడలా? ఎవరూ ఆలోచించలేదు.ఆలోచించరు కూడా! ఆ ప్రముఖుడు అలా వెంట్రుకపీకి భద్రపరచుకుంటే మంచి జరుగుతుందని ప్రజలకి ఒక సందేశం ఇచ్చినట్టయింది, ప్రజలు విరగబడ్డారు. అంటూ రాజా! మీకిది తెలియనిదా! భగవానుడు చెప్పినమాట, చిత్తగించండని ఈ శ్లోకం చెప్పేడు. యద్యాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే…భగద్గీత…అధ్యా..౩..శ్లో..21 మహనీయుడైన వ్యక్తి ఏ కార్యము చేయునో వానిని సామాన్యులు కూడ అనుసరింతురు. ఆదర్శ ప్రాయములయిన కార్యములచే అతడే ప్రమాణములను స్వీకరించునో ప్రపంచమంతయు వానిని అనుసరించును. నేటి మన సమాజం అలా లేదా?
Post Date: Sat, 07 Jan 2023 03:37:38 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sat, 07 Jan 2023 03:37:38 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment