Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 20 February 2023

పోకూరి కాశీపతిగారి ఏకపాది - ఏ.వి.రమణరాజు

పోకూరి కాశీపతిగారి ఏకపాది సాహితీమిత్రులారా! ఒక పద్యం లేక శ్లోకంలో అన్ని పాదాలు ఒకటిగా ఉంటే దాన్ని ఏకపాది అంటారు. ఇందులోని నాలుగు పాదాలూ ఒకే విధంగా ఉంటాయి కానీ అర్థాలు మాత్రం వేరుగా ఉంటుంది. కాశీపత్యవధానులు వారి హరిశ్చంద్రోపాఖ్యానము - ద్వితీయాశ్వాసము -59 వ పద్యం ఏకపాది గమనించండి- ఉత్సాహా వృత్తము - నాడు దాని గాననేర నా తుటారి జోడుగా నాడుదాని గాననేర నా తుటారి జోడుగా నాడుదాని గాననేర నా తుటారి జోడుగా నాడు దాని గాననేర నా తుటారి జోడుగా నాఁడు దాని గాన నేరనా?=పూర్వము దీన్ని ఎప్పుడూ చూడలేక పోయానా? అని ఆశ్చర్యం వెల్లడించడం ఒక అర్థం. ఈ ప్రదేశం లో ఉంటున్నప్పటికీ తెలుసుకో లేక పోతినే అని తెలివితక్కువ తనాన్ని వెల్లడించడము. రెండవ అర్థము. కాననేరన్ +ఆ +తుటారి జోడుగా నాఁడు దాని విడదీస్తే కాన నేరను అని మొదటి అర్థానికి చెల్లగా ఆ తుటారి అని ముందు పదానికి అన్వయించడానికి వీలు వుంది. అప్పుడు ఆ గడుసు దానితో సమానంగా ఆడేదాన్నికాన నేరను అని అన్వయం కుదురుతుంది
Post Date: Mon, 20 Feb 2023 14:36:47 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger