Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 25 May 2023

శ్రీమాత్రేనమః - sarma

శ్రీమాత్రేనమః అరవైరెండు సంవత్సరాల కితం, ఇరవై సంవత్సరాల వయసులో, ఇదే రోజు యుగళజీవితానికి అనుమతించి, ఏభైఆరు సంవత్సరాలు అవిఛ్చినంగా కొనసాగింపజేసిన అమ్మకు వందనం. ఐదు సంవత్సరాలుగా ఒంటరిజీవితాన్ని ప్రసాదించిన అమ్మకు వందనం. వందనము రఘునందనా! భక్త చందనా!!సేతు బంధనా!!!రామా వందనము రఘునందనా!!!!! జీవితం వడ్డించిన విస్తరి కాదు!పూల పాన్పూకాదు!! జీవితం నల్లేరు మీద నడకా కాదు, పల్లేరులూ గుచ్చుకుంటాయి. ఈ రోజు ఉదయం నడక ప్రారంభిస్తుండగా  జిలేబి పద్యం రాలింది. "తాతగారికి, యుగళపు జీవన మధురిమ ల గమనపు తొలకరి జల్లు లా తల్లి జతన్ జగమున మొదలైన దినము న గ చింతనమదె మదిని మునకలిడ ప్రణతుల్" పద్యంచూస్తూ అడుగులు ముందుకేస్తే రెండు కాళ్ళలోనూ పల్లేరుకాయలు గుచ్చుకున్నాయి. ఒక్కసారిగా కూలబడ్డా. అరికాళ్ళలో గుచ్చుకున్న పల్లేరులేరిపారేశా. లేచినిలబడ్డా!నడక సాగించా!ఆలోచనలో పడి అదేపనిగా నడుస్తుండగా ఒక మనవరాలెదురొచ్చి, తను నాముందుండి, తను వెనక్కి పరిగెడుతూ,ఏంటీ! ఎప్పుడూ లేనిదివేళ ఇంకా నడుస్తున్నారూ? అంటూ ఆపింది. ఆగాను ప్రకృతిలో పడ్డాను.అనుక్షణం నన్ను గమనించే అమ్మకు వందనం. జీవితంలో కుప్పలా కూలబడిపోయిన సంఘటనలూ ఉన్నాయి,లేవలేమోననుకున్న ప్రతిసారి లేవగలవు, ముందడుగు వెయ్యి,చివరిదాకా నడవగలవు,నడవాలనే  ధైర్యాన్ని,దృకపథాన్నిచ్చిన,అమ్మకు మరోసారి వందనం. ఈ టపా రాసేందుకు అవకాశం కలగజేసిన జిలేబికి వందనం.ఈ మధ్య కాలంలో లేనిది, ఈ టపా రాసే అరగంటలోగా రెండుసార్లు కరంటు తీసేసి, మార్పులు,చేర్పులు,కూర్పులకు తోడిచ్చిన కరంటువారికి ప్రత్యేక వందనం. మరొకసారి వందనము రఘునందనా! సేతు బంధనా!! భక్తచందనా!! రామా!! వందనము రఘునందనా!! శ్రీమాత్రేనమః
Post Date: Thu, 25 May 2023 04:14:09 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger