ఒక బ్లాగర్ అడిగారు " ఈ ఉత్తమ బ్లాగుల" ఎంపిక ఎందుకు . ఏమైనా బహుమతులు ఇస్తారా " అని.
మాకూ ఇవ్వాలనే ఉంది. కానీ ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులలో ఇచ్చే అవకాశం లేదు . ముందు ముందు ఆ అవకాశం వస్తుందని ఆశిద్దాం. ఈ ఎంపిక కేవలం బ్లాగర్లలో ఉత్సాహాన్ని నింపడానికి, మంచి టపాలు, ఎక్కువ టపాలు వ్రాస్తూ బ్లాగులోకంలో నిలిచి ఉండడానికి దోహద పడుతుంది అనే ఉద్దేశ్యంతో మొదలు పెట్టినది .
వచ్చే నెల నుండి మరింత పారదర్సకత కోసం మరిన్ని విధానాలు అవలంభించబోతున్నాము.
ఈ మాసానికి బ్లాగిల్లు చే ఉత్తమమైనవాటిగా గుర్తించబడిన 34 బ్లాగుల లిస్ట్ దిగువ ఇస్తున్నాము.
దయచేసి గమనించండి క్రింద బ్లాగుల లిస్టు ఒక వరుసక్రమంలో లేదు.
ఆయా బ్లాగరులు తమ ఉత్తమ బ్లాగులలో జతచేసుకోడానికి ఓ బేడ్జీ కూడా ఇచ్చాం.
విజేతలకు గమనిక : మీరు జతపరచిన విడ్జెట్ వచ్చేనెల మీబ్లాగులోనుండి తొలగించవలెను.
No comments :
Post a Comment