మిగతా బ్లాగు సంకలినుల్లా కాకుండా "బ్లాగిల్లు"లో విభిన్నమైన సదుపాయాలు ఉండాలని నేను కోరుకుంటాను . ఇప్పటికే బ్లాగిల్లులో గల అనేకమైన శీర్షికలు మీ అందరి మెప్పు పొందాయి . కానీ ఈ మధ్యనే ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా బ్లాగిల్లును బ్లాగర్ హోస్టింగ్ లోకి మార్చాలనే ఆలోచన వచ్చింది . దీనివల్ల హోస్టింగ్ కు అయ్యే ఖర్చు మిగులుతుంది అని. కానీ ప్రస్తుతం ఉన్న php లో వ్రాసిన కోడ్ కి బ్లాగర్ లో వ్రాయబోయే కోడ్ కి చాలా తేడా ఉంటుంది . ముఖ్యంగా బ్లాగర్ కోడ్ లో దాపరికం ఉండదు. php కోడ్ లో అది ఉంటుంది . php లో ఉపయోగించేది వాడకపుదారునకు కనపడదు . అంతేకాదు . విభిన్న అంశాలు ముద్దుగా, అందంగా తీసుకురావాలంటే php నే మంచిది . php లో ఉన్న మరో గొప్పతనం సెర్చ్ ఇంజన్లు మనం వ్రాసే సమాచారాన్ని ప్రత్యేకమయినదిగా గుర్తిస్తాయి . php కోడ్ ను వాడే విధానం బట్టి దాని ప్రత్యేకత ఉంటుంది . ఇదేమైనా గొప్ప విధ్యా ? ఎవరైనా కష్టపడితే
కనిపెట్టడం ఈజీనే అనొచ్చు . అవొచ్చు .. కానీ అన్నీ కాదు .
ఇక బ్లాగర్ ... చెప్పానుగా దీని పరిమితులు. ఇక్కడ అంతా ఓపెన్. అంతేకాదు సెర్చ్ ఇంజన్ లకు మనం వ్రాసేదే తప్ప కోడింగ్ రూపంలో పెట్టింది తెలీదు. ఈ స్క్రిప్ట్ ద్వారా వచ్చిన ఫలితం అద్భుతంగా ఉన్నా దాన్ని ఆస్వాదించ లేము. ఎందుకంటే సెర్చ్ ద్వారా మనం వ్రాసింది దొరకదు. సెర్చ్ లో వెనకబడి పోతాము .
"బ్లాగిల్లు" హోస్టింగ్ ముగియడానికి ఇంకా చాలా సమయముంది. అప్పటికల్లా ఓ అద్భుతం మన తెలుగు బ్లాగర్లకి అందివ్వాలని నా ప్రయత్నం. అది బ్లాగర్లో కావచ్చు . మరో చోట కావచ్చు.
ప్రయత్నం మొదలైంది ... ప్రయోగ ఫలితం త్వరలో మీముందు ఉంటుంది ..