Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 13 August 2014

నేటి బ్లాగిల్లు ఎంపికలు శంకరాభరణము -సమస్యల సమస్య.. మరో 3 టపాలు

"వాట్స్ ఆప్" కు బదులు ఇవికూడా వాడచ్చు....ఫోటోలు

Wednesday, August 13, 2014 1:35 PM

రచన : Satya Narayana | బ్లాగు : మీ కోసం
ఆండ్రాయడ్ అప్లికేషన్లో వాట్స్ ఆప్ అత్యంత ప్రసిద్దమైంది. కొంతమందికి "వాట్స్ ఆప్" తో ఇబ్బందులు కలుగుతున్నాయి. అంతర్జాలం మరియూ టెక్నాలజీలలో అద్భుతమైన అభివృద్ధి పెరగడంతో మామూలుగా పంపించే ఎస్.ఎం.ఎస్ లూ, వీడియో మెసేజ్ లూ వెనుకబడిపోయేయి. వాట్స్ ఆప్ మూలంగా మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు, ఆదియోలూ మరియూ ఏకంగా ఫైల్లు కూడా పంపించగలుగుతున్నారు. ఎక్కువమంది వాట్స్ ఆప్ వాడుతున్నా, ఇలాంటిదే ఇంకోటేమైనా ఉన్నదా అని వెదుకుతున్నారు. అలాంటి వారికోసం వాట్స్ ఆప్ కు బదులు ఇవిగో ఇవి గూడా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.... పూర్తిటపా చదవండి...

వ్యవసాయాభివృద్దిపథంలో చైనా
Wednesday, August 13, 2014 12:38 PM

రచన : సారంపల్లి మల్లారెడ్డి | బ్లాగు : సారంపల్లి మల్లారెడ్డి
9.6 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల చైనాలో కేవలం అన్ని పంటలకు కలిపి122 మిలియన్‌ హెక్టార్లు మాత్రమే సాగుభూమి ఉంది. (భారతదేశంలో ఒక ఆహారధాన్యాల ఉత్పత్తిమాత్రమే120 మి.హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నది.)అడవులు 195.45 మిలియన్‌ హెక్టార్లు (ప్రపంచ ఆటవిక విస్థీర్ణంలో 20.36 శాతం) ఉంది. నేడు సంభవించిన గ్లోబల్‌ వార్మింగ్‌ను అధిగమించి చైనా పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నది. ఫలితంగా వాతావరణంలో పెద్దగా మార్పులు రాలేదు. మొత్తం జనాభ... పూర్తిటపా చదవండి...

శంకరాభరణము -సమస్యల సమస్య
Wednesday, August 13, 2014 10:20 AM

రచన : subbarao | బ్లాగు : subbarao
విన్నపము జేయుచుంటిని
సన్నుత ! మఱి యాపవలదు శక్తింగొలది
నన్నువ నిచ్చుచు నుండుము
బన్నము గాకుండు నటుల బ్రతిదివ సంబున్

... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-ఉత్తర దిశగా తలపెట్టుకుని ఏందుకు నిద్రపోవద్దన్నారు.?(Scientific reason)
Wednesday, August 13, 2014 5:31 AM

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఉత్తర దిశగా తలపెట్టుకుని ఏందుకు నిద్రపోవద్దన్నారు.?(Scientific reason) ఉత్తర దిశగా తలపెట్టుకు నిద్రపోతే ఏమవుతుందో మనవారికి బాగా తెలుసు, అందుకే వద్దన్నారు. దానికితోడు దక్షణ దిశగా తలపెట్టుకుని పడుకోమనీ చెప్పేరు. దక్షిణ దిశగా కూచుని భోజనం వద్దన్నారు, చదువు కూడదన్నారు, దంతధావనం పనికిరాదన్నారు, ఏ పనీ దక్షిణంగా తిరిగి చెయ్యద్దన్నారు, ఒక్క తర్పణం ఇచ్చేటపుడు మాత్రం దక్షిణంగా కూచుని తర్పణం వదలాలి, పెద్దలకు. అంతెందుకు సంధ్యావందనంలో ‘నమో ప్రాశ్చేయ్ దిశే యాశ్చదేవతా యాతస్యాం ప్రతివసంతి యాతభ్యశ్చ నమోనమః’ […]... పూర్తిటపా చదవండి...

సమస్యా పూరణం – 1500 (అలసట వచ్చె శంకరునకు)
Wednesday, August 13, 2014 12:08 AM

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్.

కవిమిత్రులారా!... పూర్తిటపా చదవండి...

శెలవిక నేస్తం
Tuesday, August 12, 2014 10:54 PM

రచన : వరప్రసాద్ దాసరి | బ్లాగు : దాసరిగమలు
ఎక్కడ్నించో వచ్చాము
ఒక్కటిగా కలిసాము

బాధల్ని పంచుకున్నాము
కష్టాల్లో ఓదార్చుకున్నాము

మూడు నెలల ఈ సావాసాన్ని యిట్టే గడిపేసాము
నవ్వుకుంటూ- నవ్వించుకుంటూ

చివరికి వచ్చింది
ఆ రోజు
మనమంతా విడిపోయే రోజు
రానే వచ్చింది

తడబడుతూ వచ్చినా
తడి నిండిన గుండెతో తిరిగెళుతున్నాము
మది నిండా తీపి గురుతులతో
మరెన్నో మధుర జ్ఞాపకాలతో

వీలుంటే
మళ్ళీ అవకాశముంటే
మళ్ళీ కలుద్దాము
లేదంటే వాట్సప్ లోనో పూర్తిటపా చదవండి...

కేప్ కోరి గురించి మీకు తెలుసా?
Tuesday, August 12, 2014 8:56 PM

రచన : Dantuluri Kishore Varma | బ్లాగు : మన కాకినాడలో....
పద్దెనిమిదవ శతాబ్దంలో దేశంలో ప్రధానమైన రేవు పట్టణాలలో కేప్‌కోరి ఒకటి. 1759లో బ్రిటిష్‌వాళ్ళు దీనిని నిర్మించారట. ఒక లైట్ హౌస్ కూడా కట్టారు. గత కాలపు వైభవానికి శిధిలావస్థలో ఉన్న అప్పటి లైట్‌హౌస్ ఒక గుర్తు. ప్రస్తుతం దేశంలో ఉన్న అతి పురాతనమైన లైట్‌హౌసుల్లో ఇది ఒకటి. అసలు కేప్‌కోరీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారా? కాకినాడకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరంగే అప్పటి కేప్‌కోరీ. ఇక్కడి నౌకా నిర్మాణ... పూర్తిటపా చదవండి...
A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger