Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 16 September 2014

దర్శిస్తే ..... ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

దర్శిస్తే ..... ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


దర్శిస్తే .....

Posted: 15 Sep 2014 05:10 PM PDT

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
కొండమీదనుంచి దృష్టిసారిస్తే
సుందరదృశ్యాలు కన్పడతాయి

అక్కడక్కడ కొన్ని కొండలు
నగరాలను చూపిస్తాయి

పాము మెలికలు తిరుగుతూ నడుస్తున్నట్టు
కొన్ని కొండలను తాకుతూ నదులు సాగిపోతాయి
చెట్లాకులతో హరితవస్త్రాన్ని ధరించి హొయలుపోతాయి

నదికి నిశ్చలత్వం లేనట్టే మనసు కూడా
కొద్దిసేపు ఆ నదిలో చేపనై ఈదాలని
ఈది ఈది అలసిన చేపకు రెక్కలొచ్చి
హరిత వస్త్రంపై వాలి సేదదీరాలని ఉవ్విళ్ళూరుతుంది

కొన్ని కొండలు దేవతానిలయాలు
వలయాలు వలయాలుగా చిక్కుకున్న మనిషి
వీటిమధ్య తిరుగుతూ ఉంటాడు

***

కొండలను పిండిచేసే రహస్యా... పూర్తిటపా చదవండి...

దూరంగా … క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి

Posted: 15 Sep 2014 12:20 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ప్రతిస్పందనలేని ఈ నేలమీది నిశ్శబ్దమూ,

ప్రత్యుత్తరం లేని కడలి గంభీరమైన ఘోషా,

రెండూ నాకు ఒకే అర్థాన్ని అందిస్తున్నాయి:

దూరం, దూరం. మేం దూరంగా ఉంటున్నాం.

నువ్వుకూడా  దూరంగా  ఉండు ఖచ్చితమైన హద్దులో:

అదే నీ లోపలి శాంతి; మేము నిన్ను కట్టిపడెయ్యము;

కాని, నీకు నువ్వు వేసుకున్న సంకెళ్ళనుండి ఎవరు విడిపించగల... పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి -5

Posted: 15 Sep 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- నగర జీవనము
ఛందస్సు- కందము
మొదటిపాదం మొదటి అక్షరం 'న', రెండవపాదం రెండవ అక్షరం 'గ', మూడవ పాదం మూడవ అక్షరం 'ర', నాల్గవ పాదం నాల్గవ అక్షరం 'ము'.

... పూర్తిటపా చదవండి...

జానపద గేయాలు – అనసూయాదేవి గారు

Posted: 15 Sep 2014 10:51 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
అనసూయా దేవిగారు పాడిన "బందారు చిన్నదాన బాజాబందూలదాన" అనే పాట అలాగే "నందగిరి బంగారుమామ చంద్రగిరి చీరలంపేవా" అనే పాట విందాము. అయితే ఈ సందర్భంగా సూర్యకుమారి గారిని గూడా మననం చేసుకోవాలి. ఆవిడ కూడా ఈ పాట పాడారు. ఆవిడ స్టేజ్ మీద పాడుతుండగా రికార్డు చేసిన వీడియోను యూట్యూబ్ లో ఉంచిన శ్రీ ఎన్. అప్ప... పూర్తిటపా చదవండి...

భారత్‌లో విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లు

Posted: 15 Sep 2014 10:02 AM PDT

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
      అపారమైన అవకాశాలుగల భారత దిగువ శ్రేణి స్మార్ట్‌ఫోన్ విపణిలోకి గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల తో ప్రవేశించింది. దేశియ ఫోన్ తయారీదారులయిన స్పైస్, మైక్రోమాక్స్ మరియు కార్బన్ లతో జట్టు కట్టి చవక స్మార్ట్‌ఫోన్‌లను ఈ రోజు విడుదలచేసింది. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా భారత్‌లోనే ఈ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను విడుదలచేయడం విశేషం. తాజా ఆండ్రాయిడ్ వెర్షనుతో (కిట్‌కాట్) వచ్చే ఈ ఫోన్‌లకు కొత్త ఆండ్రాయిడ్ వెర్షను విడుదలైన వెంటనే తొందరగా అప్‌డేట్లు రావడం, తయారీదారు అప్లికేషన్‌లు మరియు మార్పులు తక్కువగా ఉండి శుద... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger