Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 18 October 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-ముందుచూపులేనివాడు…… ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-ముందుచూపులేనివాడు…… ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-ముందుచూపులేనివాడు……

Posted: 17 Oct 2014 05:03 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ముందుచూపులేనివాడు…… ముందుచూపులేనివాడు ఎందులకూ కొఱగాడు, బుద్ధిబలము తోడైతే విజయమ్ము సాధించగలడు, అన్నారో సినీకవి…. భూమి,నీరు, నిప్పు,వాయువు,ఆకాశమూ పంచభూతాలు. మిన్ను విరిగి మీద పడినా అంటారు కాని విన్నెపుడూ విరగలేదు, విరగదు కూడా. ఇక ప్రకోపించేవి నాలుగే. అందులో ఏ ఒకటి ప్రకోపించినా మరొక భూతం అండలేక బతకలేం. భూమి కంపిస్తే దారేలేదు. మిగిలిన మూడిటికి నీరు కోపిస్తే భూమి ఆశ్రయం. నిప్పు,గాలి ప్రకోపిస్తే భూమిలో, కలుగులో ఆశ్రయం క్షేమం. ఇవెందుకు ప్రకోపిస్తున్నాయి? అది మన స్వయంకృతాపరాధం. మొన్న […]... పూర్తిటపా చదవండి...

తారకమంత్రము

Posted: 17 Oct 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తారకమంత్రము .... వర్ణన.


కందము:
తారలు సూర్యుడు చంద్రుడు
తీరుగ ఝరి గిరులు నిలచి తీరెడు వరకున్
మీరుచు జగమును బ్రోచెడు
తారక మంత్రమ్ము "రామ" తలపన్ రారే !
... పూర్తిటపా చదవండి...

మొర… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి

Posted: 17 Oct 2014 12:09 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

అంతా మారిపోయింది… నేను పేదనైపోయాను;

మొన్న మొన్నటి వరకూ, నీ ప్రేమ

నా హృదయ కవాటం ముందు

ప్రవహించడమే తన ధర్మంగా ఉండేది.

నా అవసరం, దాని ఔదార్యం అన్న

ఆలోచన లేకుండా అనంతంగా ప్రవహించింది. 

ఎన్ని మధుర క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడిపేను!

పూర్తిటపా చదవండి...

అందమైన బహుమతి......

Posted: 17 Oct 2014 11:49 AM PDT

రచన : Rajasekhar Panigrahi | బ్లాగు : సుజాత

Good Morning Friends

... పూర్తిటపా చదవండి...

దత్తపది - 49 (కోపము-చాపము-తాపము-పాపము)

Posted: 17 Oct 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
కోపము - చాపము - తాపము - పాపము
పైపదాలను ఉపయోగిస్తూ ఉతరుని ప్రగల్భములను గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

ఆనాటి వాన చినుకులేవి

Posted: 17 Oct 2014 11:20 AM PDT

రచన : Hima bindu | బ్లాగు : హిమబిందువులు
ఈ రోజు చాలా కాలం తరువాత బ్లాగిళ్ళ కు తిరిగి వచ్చాను పాత ఇళ్లన్నీ వెల వెల బోతున్నాయి కొత్తవన్ని కళ కళ లాడుతున్నాయి ... దాదాపు అన్ని ఇళ్ళు మూసేసి వున్నాయి నెమలికన్ను మరువం పద్మర్పిత తేటగీతి బ్లాగిళ్ళు మాత్రం ముత్యాల ముగ్గులతో కళ గా వున్నాయి కాసేప్పక్కడ తచ్చాడి మూసేసిన వాకిళ్లలో నాటి స్మృతి సుగంధాలను ఆఘ్రాణించి వెనుదిరిగాను 
... పూర్తిటపా చదవండి...

ఆండ్రాయిడ్ కీబోర్డ్‌తో ఇప్పుడు తెలుగు కూడా టైప్ చేయవచ్చు

Posted: 17 Oct 2014 10:38 AM PDT

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
       ఆండ్రాయిడ్ 4.2.2 తో తెలుగు అక్షరాలు చూడడానికి మద్దతును కల్పించిన గూగుల్ మొన్న విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్‌లో తెలుగుభాషలో ఫోన్‌ని వాడుకోనే వెసులుబాటునుచేర్చడం జరిగింది. దానితో పాటు ఎటువంటి అధనపు కీబోర్డ్ యాప్ ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే ఆండ్రాయిడ్లో వచ్చే గూగుల్ కీబోర్డ్ తో తెలుగుటైప్ చేయడానికి కావససిన మద్దతును కూడా చేర్చారు. అయితే అధికారికంగా ఆండ్రాయిడ్ 5.0 విడుదలైనప్పటికి మనవరకు ఆ అప్‌డేట్ రావడానికి  ఇంకా సమయం పట్టవచ్చు. అయితే గూగుల్ నుండి అప్‌డేట్ వచ్చినప్పటికి తయారీదారులందరు వారి పరికరాలకు అప్‌డేట్‌ని విడుదల చేయకపోవచ్చు కూడా. అయినప్పటికి అన్ని ఆ... పూర్తిటపా చదవండి...

ఈస్టిండియా కంపెనీ కధ, కమామిషు – సి. ఎస్. రావు

Posted: 17 Oct 2014 10:08 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఇదేదో బ్రిటిష్ వారి ఈస్టిండియా కంపెనీ కధ అనుకొనేరు సుమా, ఇది ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ కధ. ఈ కధ చెబుతున్నవారు సి. పుల్లయ్య గారి తనయుడు శ్రీ సి. ఎస్. రావు గారు. 1980 జ్యోతిచిత్ర సినిమా సంచిక నుండి. పాత తెలుగు చలనచిత్రాల విశేషాలు తెలుసుకుందాం అనుకొనేవారికి ఆసక్తికరంగా ఉంటుంది. 


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger