Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 25 October 2014

ముద్దబంతులు ... మరో 9 వెన్నెల వెలుగులు

ముద్దబంతులు ... మరో 9 వెన్నెల వెలుగులు


ముద్దబంతులు

Posted: 25 Oct 2014 06:57 AM PDT

రచన : రాధిక(నాని ) | బ్లాగు : చిత్తరువు

అమోనియమ్ టార్టరేట్ స్ఫటికాల మీద పాశ్చర్ కృషి

Posted: 25 Oct 2014 06:47 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
ధృవీకృత కాంతి యొక్క లక్షణాలు, ప్రవర్తన అంతా 1815  వరకు భౌతిక శాస్త్ర పరిధికే పరిమితమై వుండేవి. కాని ఆ ఏడాది జాన్ బాప్తిస్త్ బయో (1774-1862) అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ధృవీకృత కాంతి యొక్క  ఓ చిత్రమైన ప్రవర్తనని బయటపెట్టాడు. ధృవీకృత కాంతిని కొన్ని ప్రత్యేక స్ఫటికాల లోంచి పోనిచ్చినప్పుడు కాంతి కంపించే తలం తిరుగుతుంది. ఆ భ్రమణం (rotation)  కొన్ని సార్లు సవ్య దిశలోను (clockwise)  మరి కొన్ని సార్లు అపసవ్య (anticlockwise)  దిశలోను తిరుగుతుంది. సవ్య దిశలో జరిగే తిరుగుడుని dextrorotation అని, అపసవ్... పూర్తిటపా చదవండి...

'మా తండ్రి శేషయ్య గారు'

Posted: 25 Oct 2014 06:43 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
నీలంరాజు వేంకట శేషయ్య.. ఈ పేరుని ఈతరం సాహిత్యాభిమానులకి పరిచయం చేయాలి అంటే, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆత్మకథ 'అనుభవాలూ-జ్ఞాపకాలూను,' బుచ్చిబాబు నవల 'చివరకి మిగిలేది' లని తెలుగు పాఠకులకి తొలిసారిగా అందించిన 'నవోదయ' పత్రిక సంపాదకుడు అని చెప్పాలి. సినీ అభిమానులకైతే తొలితరం తెలుగుసినిమా 'ఉషా పరిణయం' లో కథానాయకుడు అని చెప్పాలి. రాజకీయ రంగంవారికి చెప్పేప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు మొదలు నీలం సంజీవరెడ్డి వరకూ ఎందరో నాయకులకి ఆంతరంగికుడు అని చెప్పడం మర్చిపోకూడదు.

సంగీతాభిమానుల దగ్గర ప్రస్తావించేప్పుడు భద్రాచలంలో 'రామదాస ధ్యానమం... పూర్తిటపా చదవండి...

తుఫాన్ బాధితులపై వాలుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా

Posted: 25 Oct 2014 06:22 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
హుదుద్ పూర్తిటపా చదవండి...

అక్షరాయుధాన్నై ...,

Posted: 25 Oct 2014 04:11 AM PDT

రచన : Meraj Fathima | బ్లాగు : కవితా సుమహారం.




పూర్తిటపా చదవండి...

పిల్లల సంరక్షణ - మనకు డాక్టర్‌ అందుబాటులో లేనప్పుడు...

Posted: 25 Oct 2014 04:10 AM PDT

రచన : Hyderabad Book Trust | బ్లాగు : Hyderabad Book Trust

పిల్లల సంరక్షణ - మనకు డాక్టర్‌ అందుబాటులో లేనప్పుడు...<... పూర్తిటపా చదవండి...

వానా వానా వల్లప్ప!

Posted: 25 Oct 2014 03:16 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
వాన వానా వల్లప్ప
వల్లప్పకు ఆహాహా!
దొరికినవీ కానుకలు
కోకొల్లల వేడుకలు!  ||

తిరిగి తిరుగు ఆటలు
తిరుగు తిరుగు ఆటలు
తారంగం పాటలు!
జలతరంగిణీ ఆటలు ॥  

'వాన చుక్క టప్పు టప్పు!
తడవకండి, తప్పు తప్పు
పడిసెం, జలుబులు కలుగును
తడవకండి, తప్పు తప్పు'

తప్పంటే ఆగేరా
ఈ అల్లరి పిల్లలు!?
ఆనక ఆ పెద్దలే
అవుతారు పిల్లలుగా

వాన వానా వల్లప్ప
వల్లప్పకు ఆహాహా
దొరికినవీ కానుకలు
కోకొల్లల వేడుకలు  ||

*******************,
పూర్తిటపా చదవండి...

నాయుడుపేట హాస్పిటల్

Posted: 25 Oct 2014 03:09 AM PDT

రచన : లోక్ నాథ్ కోవూరు | బ్లాగు : హృదయ జ్వాల
నిన్న అనుకోకుండా నేను  గవర్నమెంట్ హాస్పిటల్ కి (నాయుడుపేట) వెళ్ళాల్సి వచ్చింది, వెళ్లాను .. ఊహించినట్టే అక్కడి  దుర్గందం నాకు సాదరంగా స్వాగతం పలికింది ముందురోజు కురిసిన వర్షం తాలుకు నీరు చాల దర్జాగా అక్కడే తిష్ట వేస్కుని పడుకుని ఉంది.హాస్పిటల్ బైట లోపల అపరిశుబ్రమైన వాతారణం  ...నాకు    బాగా సన్నిహితుడు మిత్రుడు    మచ్చాలేవో ఉన్నాయని  అక్కడి డాక్టర్ ని కవలడానికి వెళ్తున్నా రారా అంటే వెళ్ళా... నేరుగా  సంబందిత గదికి వెళ్ళగా .. డాక్టర్ లేరు .. పక్కనున్న ఆసుపత్రి సిబ్బందిని అడగగా ఆయన "దొరవారిసత్రం" దగ్గర జరుగుతున్న "జన్మభూమి" కార్యక్రమానికి వెళ్ళార... పూర్తిటపా చదవండి...

కమనీయ మోహ జనిత వైభవమ్ము..............

Posted: 25 Oct 2014 03:09 AM PDT

రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం
కటిక చీకటు లెల్ల గడగడ వడకుచు
..........పారిపోవగ జేయు ప్రబల శక్తి
కిటికీల ద్వారాల పటుతరమ్ముగ దూరి
..........మేలు కొల్పులు పాడు మెరుపు తీవ
తటినీ జలమ్ముల తరగల పై స్వర్ణ
..........రోచిస్సు లద్దెటి కూచిక గన
నటియింప ప్రాగ్దిశన్ నగుమోముతో నుషా
..........సుందరి నవ్వుకు స్ఫూర్తిదాత

చూడరే శరత్ప్రాభాత సూర్య కిరణ
పుంజ మంజుల కమనీయ మోహ జనిత
వైభవమ్మును, ధాత్రిని శోభలీను
తీరు ననునిత్యమున్ మీరు దివ్యమగును.
పూర్తిటపా చదవండి...

వాత రోగాలు ఎందుకు కలుగుతయ్??

Posted: 25 Oct 2014 02:44 AM PDT

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
మనలో చాలామంది ఒకేరకమైన రుచులను అధికంగా తినటానికి బాగా అలవాటు పడ్డారు. కొందరు ఆవకాయ  పచ్చడి విపరీతంగా తింటే, మరి కొందరు మాంసము మూడుపూటలా తింటారు.ఇంకొందరు ఎక్కువగా చేదుగా వుండే పదార్ధాలను అమితంగా భుజిస్తారు. ఇలా ఏ ఒక్కటో, రెండో రుచులకు మాత్రమే అలవాటు పడి, మిగతా రుచులను స్వీకరించకపోవడం వల్లనే శరీరంలో దోషాలు ధాతువులు అసమానమై సమతౌల్యం దెబ్బతిని సకల రోగాలకు మూలకారణం అవుతున్నయ్.

కొన్ని ముఖ్యమైన కారణాలు చూద్దాం :

1. కారము, చేదు, వగరు ఈ మూడు రుచులు గల పదార్ధాలను అతిగా సేవించడం
2. బాగా ఎక్కువ గానీ, తక్కువ గానీ భుజించడం
3. అతి వేడిగా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger