Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 15 August 2021

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.  అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టు. ఇది ఒక నానుడి. మాచకమ్మకి వాళ్ళ అక్కకి వయసు తేడా తక్కువే. మాచకమ్మ అక్క ఈడేరింది, అందమైనది కూడా.  కులగోత్రాలకీ లోటు లేదు,పేదవారైనా. దానితో పక్కవూరి ఊరి మోతుబరి కొడుకు కోరి వరించేడు.పెళ్ళి ఘనంగానే జరింది. అప్ప అత్తారింటికీ వెళ్ళింది.అక్కడ అప్ప మహరాణీలా వున్నట్టు కబురులూ తెలుస్తున్నాయి. ఇంట్లో అత్తామామల దగ్గరనుంచి, భర్త, నౌకర్లు చాకర్లు అంతా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు వార్తలు తెలుస్తున్నాయి. పెళ్ళైన సంవత్సరం తిరగ్గానే అప్ప నీళ్లోసుకుంది. ఇక అప్ప అత్తారింట్లో ఆనందానికి పట్ట పగ్గాలూ లేవు. ఈవార్తలు తెలుస్తుండడంతో పుట్టింట అందరూ ఆనందంలో ములిగి తేలుతున్నారు, మాచకమ్మతో సహా. కాలం గడచింది, అప్ప మగ బిడ్డను కన్నది. అప్ప అత్తవారు కోడలిని అడుగు కింద పెట్టనివ్వటం లేదు. రెండో ఏడు పూర్తికాకుండానే బిడ్డ తల్లీ అయింది. అప్ప భర్తకి వ్యాపారం కలిసొచ్చి కొత్తగా పొలమూ కొన్నాడు. అప్ప  జీవితం వేలేస్తే కోలు దిగబడేలా ఉంది,అత్తారింటిలో. మాచకమ్మకి అప్పకి జరుగుతున్నదంతా మొదటిలో అంతా ఆనందంగానే గడచినా, రెండేళ్ళలో కూడా మాచకమ్మ ఈడేరలేదు సరిగదా స్త్రీ లక్షణాలే పూర్తిగా ఏర్పడ లేదు. చూస్తేనే మాచకమ్మ సంసారానికి పనికి రాదని తెలిసిపోతూ ఉంది. ఎవరూ మాచకమ్మ పెళ్ళి మాటే ఎత్తటంలేదు, దానితో అప్ప వైభోగం చూస్తున్న మాచకమ్మకి మొదటిలో అప్ప పట్ల అసూయ పుట్టి ఆ తరవాతది పెరిగి ఈర్ష్యగా మారింది, కాని ఏం చేయగలదు? మడమలు తొక్కుకోవడం తప్పించి. మడమలు తొక్కుకోవడం అంటే నాట్యం చెయ్యడం చేతకాక కాళ్ళు తొక్కుకోడం అంటారు.ఇలా నిరాశతో అసూయ చెంది, దానిని ఈర్ష్యగా మార్చుకుని బాధ పడడాన్నే అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టని అంటారు.  ఎవరి పుట్టుకవారిదే,ఎవరి అదృష్టం వారిదే, ఒకే తల్లి పిల్లలైనా. ఎవరి అందం, తెలివి,రాత, జీవితం వారివే. ఎవరి వైభొగమూ మనకు రాదు, ఎవరి దరిద్రమూ మనిని అంటదు, ఎవరి చావూ వారిదే. ఒకరిని చూసి అసూయ చెంది ఈర్ష్య పడితే జీవితం లో ఏదీ సాధించలేరు, నిరాశ తప్ప. - sarma

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టు. ఇది ఒక నానుడి. మాచకమ్మకి వాళ్ళ అక్కకి వయసు తేడా తక్కువే. మాచకమ్మ అక్క ఈడేరింది, అందమైనది కూడా.  కులగోత్రాలకీ లోటు... [శోధిని తెలుగు బ్లాగుల సంకలిని నుండి]
Post Date: Sat, 14 Aug 2021 20:22:41 PDT
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger