Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 15 July 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౧(591) - Aditya Srirambhatla

( శ్రుతి గీతలు ) 10.2-1229-సీ. జగతిపై బహుతీర్థ సదనంబు లనఁ గల్గి- పుణ్యానువర్తన స్ఫురితు లగుచుఁ బాటించి నీ యందు బద్ధమత్సరములు- లేక భక్తామరానోకహంబ వగు భవత్పాదాబ్జయుగళంబు సేవించి- భవపాశముల నెల్లఁ బాఱఁదోలి సమమతులై యదృచ్ఛాలాభ తుష మేరు- సమముగాఁ గైకొని సాధు లగుచుఁ 10.2-1229.1-తే. బాదతీర్థంబు గల మహాభాగవత జ నోత్తమోత్తము లైనట్టి యోగివరుల వార కెప్పుడు సేవించువాఁడు వొందుఁ బ్రవిమలానందమయ మోక్షపదము మఱియు. భావము: భాగవతోత్తములు లోకానికే మహాతీర్థములు. అట్టి పుణ్యవర్తన మూర్తులు మాత్సర్యాది విముక్తులై, భక్తులపాలిటి కల్పవృక్షమైన నిన్ను నిరంతరం సేవిస్తుంటారు. భవబంధాలనుంచి విముక్తులై సమచిత్తులై సదా సంతుష్ట మనస్కులై పరమ సాధు స్వభావులు అయి ఉంటారు. వారి పాదములే పుణ్యతీర్థములు. అట్టి పరమభాగవతులను భజించేవాడు ఆనందమయమైన మోక్షసామ్రాజ్య పదవికి యోగ్యుడు అవుతాడు. అంతేకాకుండా.... http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1229 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Fri, 15 Jul 2022 12:40:59 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger