Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 18 July 2022

"బొట్టు" కందాలు. - గోలి హనుమచ్చాస్త్రి

కందము: శ్రీకరమగు నిది నుదుట వ శీకరమని తలచ బోకు క్షేమంకరమౌ 'ఛీ' కరమున తుడుపకుమా మీకరమే తిలక మిడగ మెత్తురు సురులే. కందము: పుట్టిన పట్టికి దిష్టియె వట్టిగనే తగులకుండ పట్టుచు "చాదే" పెట్టును తల్లియె నుదుటన బొట్టి గ మన మొట్టమొదటి బొట్టది గదరా! కందము: ళులుళులుళాయీ యనుచును తల ద్రిప్పెడు బిడ్డ నుదుట తంటాల్ బడుచున్ కలిపిన 'చాదును' బెట్టెడు తెలుగింటను తల్లిని గన తీయని తలపౌ. కందము: ఇంటికి వచ్చిన బొట్టే ఇంటికి రమ్మనుచు  జెప్ప నింతికి బొట్టే కంటికి "నో" యెబ్బెట్టే వింటిరె మన సంసృతిగన వేడ్కగు నిట్టే! కందము: గోటికి గోరింటాకే మేటిగ కాలికినిగజ్జె మీదట తీరౌ కాటుక కంటికి, జడయును బోటికియందమ్ము నుదుట బొట్టే సుదతీ! కందము: శోభను గూర్చునుగద నొక యాభరణము చేరియున్ననది మగువలకే ఆభరణమె బొట్టొక్కటి సౌభాగ్యమె నుదుట బెట్ట చక్కటి మోమున్. కందము: అద్దము చేతను బట్టుచు నొద్దికగా ముఖము గనుచు నొకచేతన్ తా ముద్దుగ నుదుటను కుంకుమ దిద్దెడు భంగిమ పడతికి తీరుగనుండున్. కందము: నీమము వీడక కొందరు కోమలులే బొట్టు నుంత్రు క్రొత్తగ, కలిలో లేమకు చర్మపు రంగున నేమైనా "ఉంది" "లేద" నేటట్లుండున్. కందము: హిందువు నీవేయైనచొ బిందువుగా నుదుట బొట్టు పెట్టుము చాలున్ అందునలౌకిక భావన మందును మనమనమున కొక హాయే గలుగున్. కందము: తిలకము నుదుటన దిద్దుము తిలకించుము మోము చుట్టు తేజము హెచ్చున్ పులకింతలు మది గలుగగ తిలకమవై సాటివారి  తీరును గనుమా!
Post Date: Mon, 18 Jul 2022 03:10:47 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger