Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 5 August 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౦(600) - Aditya Srirambhatla

( వృకాసురుండు మడియుట ) 10.2-1246-క. అని వేఁడిన నమ్మాటలు విని మదనారాతి నవ్వి విబుధాహితు కో రిన వరముఁ దడయ కిచ్చిన దనుజుఁడు తద్వర పరీక్షఁ దాఁ జేయుటకున్. 10.2-1247-వ. ఆ క్షణంబు వరదాన గర్వంబున నుద్వృత్తుండై కడంగి. 10.2-1248-క. ఆ హరుమస్తకమునఁ గడు సాహసమునఁ జేయి వెట్ట జడియక కదియ "న్నోహో! తన మెచ్చులు దన కాహా! పై వచ్చె" ననుచు నభవుఁడు భీతిన్. భావము: అలా అని ఆ రాక్షసుడు ప్రార్ధించాడు. అది విని శివుడు చిరునవ్వు నవ్వుతూ అతడు కోరిన వరము వెంటనే ఇచ్చాడు. ఆ రాక్షసుడు పార్వతీపతి తనకు అనుగ్రహించిన వరాన్ని పరీక్షించాలనుకున్నాడు. తక్షణమే వరగర్వంతోవాడు అహంకరించాడు. ఆ వరం పరీక్షించడానికి సిద్ధపడి ముందుకు వచ్చి. తన చేతిని పరమశివుడి తలమీద పెట్టడానికి ఆ రాక్షుసుడు తెగించాడు. "అయ్యయ్యో నేనిచ్చిన వరం నామీదకే అపాయం తెచ్చిపెట్టిందే" అని శివుడు భయపడి పరుగెత్తాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1248 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Fri, 05 Aug 2022 15:29:33 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger