Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 22 August 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౮(608) - Aditya Srirambhatla

( భృగుమహర్షి శోధనంబు ) 10.2-1267-క. వితతక్రియ లొప్పఁగ స త్క్రతువుల నొనరించు చచటఁ గైకొని లక్ష్మీ పతి భవ పితామహులలో నతులితముగ నెవ్వ రధికు లని తమలోనన్. 10.2-1268-వ. ఇట్లు దలపోసి తన్మమహత్త్వం బంతయుం తెలిసి రమ్మని భృగు మహాముని నమ్మువ్వురు వేల్పులకడకుం బంపిన నత్తాపసోత్తముండు సనిచని ముందట. 10.2-1269-క. జలరుహసంజాత సభా స్థలమున కొగి నేఁగి యతని సత్త్వగుణంబుం దెలియుటకై నుతివందన ములు సేయక యున్న నజుఁడు ముసముస యనుచున్. భావము: వారు పలు యాగాలను వైభవోపేతంగా చేయసాగారు. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు ఎక్కువ గొప్పవారు అన్న చర్చ వారి మధ్య వచ్చింది. ఇలా చర్చించుకుని, భృగుమహర్షిని త్రిమూర్తుల మహత్యములను పరీక్షించి రమ్మని పంపారు. అంతట ఆ మహర్షి బయలుదేరి వెళ్ళి ఆయన సత్త్వ గుణసంపదను పరీక్షించాలి అనుకుని, బృగుమహర్షి బ్రహ్మదేవుడి కొలువులోనికి ప్రవేశించాడు. బ్రహ్మను స్తుతించకుండా ఆ మహర్షి మౌనంగా నిలబడ్డాడు. బ్రహ్మదేవుడు రుసరుస లాడి చిరాకుగా చూస్తూ.... http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1269 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Mon, 22 Aug 2022 16:23:56 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger