Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 30 October 2022

మనం ఇంతే! - sarma

మనం ఇంతే ! చెప్పాలనిపించింది,చెప్పేశా!  సంఘటన తరవాత ఆ వీధిని వెళ్ళడం మానేసాను, ఎందుకైనా మంచిదని.మరో వీధిన రాకపోకలు సాగిస్తున్నా! ఈ వీధి పరిస్థితి ఆ వీధికంటే అధ్వాన్నంగా ఉంది. ఇంటికో డస్టుబిన్ను, దానినిండా పారేసిన అన్నం, చూస్తే కడుపు తరుక్కుపోయింది,మళ్ళీ ఆవేశం వచ్చేసిందిగాని తమాయించుకున్నా! తలొంచుకుని వెళిపోడం అలవాటు చేసుకున్నా! సాధ్యం కావటం లేదు. ఈ డస్టుబిన్నులు ఎత్తుగా స్థంబాలకి కట్టేరు, విశేషం ఏమని అడిగా ఒకరిని. వారు చెప్పినది,ఈ డస్టుబిన్ను నిండితే, పందులని పెంచుకుంటున్నవారొచ్చి పట్టుకుపోతారనీ, డస్టుబిన్ను నిండా ఇలా ఇచ్చినదానికి డబ్బులు కూడా ఇస్తారని చెప్పేరు, నాకు ఒళ్ళు కంపరమే పుట్టింది. ఏం చేయగలను, అశక్తుడిని, తలొంచుకుని పోతున్నా! ఎవరికి ఉ.బో.స లు చేయకూడదని తీర్మానించుకున్నా. చలితిరిగింది, ఉదయం నడక మంచిదికాదనిపించింది. సాయంత్రం ఏ సమయానికి వెళితే బాగుంటుందని బయలుదేరా నాలుగున్నరకి. ఇది చాలా హడావుడి సమయం. కేంపస్ లో కెజి నుంచి పిజి దాకా ఉంటారు విద్యార్థులు, నాలుక్కి చిన్న పిల్లలతో మొదలయ్యే పిల్లలు వెళ్ళడం పి.జివాళ్ళు చివరవెళ్ళడంతో హడావుడి ముగుస్తుంది. ఈ లోగా బస్సులరాకపోకలు, అబ్బో పెళ్ళివారిల్లే! ఈ మధ్యలో నడకకి వచ్చే స్త్రీలు, ముసలాళ్ళ రాకపోకలు. ఇక గ్రవుండ్ కి వెళితే  మూలనుంచి ఫుట్బాలే  కాళ్ళలో   , పడుతుందో, బేస్కెట్బాలే నెత్తిన పడుతుందో, క్రికెట్బాలే పక్కటెముకల్ని ముద్దు పెట్టుకుంటుందో,చెప్పలేం. :) ఇక ఏ కుర్రాడో, కుర్రదో పరిగేట్టుకొచ్చి గుద్దేస్తారో అని పీకుతూ ఉంటుంది. ఈ మధ్యలో ముసలాళ్ళు, ఆడాళ్ళు నడక, ఏం చెప్పను ఆనందం పొంగిపొర్లుతూ ఉంటుంది. పిల్లలికి ఆడుకునే సమయం కాదంటే ఎలా? వాళ్ళని అలా ఉత్సాహంగా చూడడం కూడా ఉత్సాహం తెచ్చుకున్నట్టే :) మరొకొంచం చలిపెరగనిద్దామని తీర్మానించుకుని ఉదయపు నడకే మళ్ళీ మొదలెట్టా. అనుకోకుండా పాతవీధినే వచ్చేస్తున్నా. షరా మామూలే. ఆ పడచు గిన్నెతో అన్నం బయట పారబోసి వెళుతోంది, నన్ను చూసింది కాని తలొంచుకుని గబగబా లోపలికెళిపోయింది. నేనూ మరి మాటాడక తలొంచుకుని వచ్చేసాను. రోజూ అన్నం ఇలా ఎందుకు పారేస్తున్నారు, ప్రశ్న దొలిచింది. ఒక అవ్వని అడిగా! నీకెందుకీ గోల ఈ వయసులో విదిలించింది. తెలుసుకుందామనీ, నసిగేసా! ఏమనుకుందోగాని, అన్నం పారెయ్యడం ఆడాళ్ళకి ఇష్టమా? కాని తప్పక పారేస్తున్నారు, ఎంత బాధపడుతూ పారేస్తారో చెప్పలేను. రోజూ రాత్రి అన్నం వండుతుంది, ఎదురు చూస్తుంది భర్తకోసం, ఆశ నిరాశే! తను తాళలేకపోతే తింటుంది, లేదంటే తనూ పస్తే ఉంటుంది. ఏ రాత్రికో తూలుకుంటూ ఇంటికొస్తాడా మనిషి. వచ్చినవాడు, మూడు నిమిషాలు పొల్లి పక్కకి తిరిగి పడుకుంటాడు. తిండి లేదు, ఇదేమని అడిగితే సమాధానంలేదు, లేదా చెయ్యి చేసుకుంటాడు. ఏం చెప్పమన్నావ్! గవళ్ళ గంగమ్మగారి హస్తోదక మహిమ, అని కొంగు దులుపుకుని లోపలికెళిపోయింది.
Post Date: Sun, 30 Oct 2022 03:34:37 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger