Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 22 August 2022

నాలుగు స్వరాలతో పద్యం - ఏ.వి.రమణరాజు

నాలుగు స్వరాలతో పద్యం సాహితీమిత్రులారా! పాదానికి ఒక అచ్చు చొప్పున నాలుగు పాదాలకు నాలుగు అచ్చులతో కూర్చిన పద్యం ఇది దండి కావ్యాదర్శం లోనిది. అమ్నాయానా మాహాన్త్యావాగ్గీతీ రీతీ: ప్రీతీభీతీ: భోగోలోగో మోదో మోహోధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే (కావ్యాదర్శమ్ -3-84) అర్థం - అమ్నాయానాం - వేదాలలో, అన్త్యా - చివరిదైన ఉపనిషత్తు, గీతీ: - గానములను, ఈతీ: - ఈతిబాధలుగాను,  ప్రీతీ: - దారాపుత్రాదులందు ప్రేమలను, భీతీ: - భయస్వరూపములైనట్టివిగాను, అహ - చెప్పుచున్నది. భోగ: - విషయోపభోగము, రోగ: - రోగహేతువు, మోద: - సాంసారిక సుఖానుభవము, మోహ: - అవివేకరూపమైనది, అందుచే, క్షేమే - పరమాదరహితమైన, దేశే - ఏకాంత ప్రదేశంలో, ధ్యేయేవా - ధ్యేయమగు పరమాత్మస్వరూపంనందు, ఇచ్ఛేత్ - మనసును నిలుపుటకు కోరుకొనవలెను. అమ్నాయానా మాహాన్త్యావా గ్గీతీ రీతీ: ప్రీతీభీతీ: భోగోలోగో మోదో మోహో ధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే మొదటిపాదంలో అకారము(అ,ఆ - అచ్చులు) రెండవపాదంలో ఇకారము (ఇ,ఈ - అచ్చులు) మూడవపాదంలో ఓ కారము(ఒ, ఓ - అచ్చులు) నాలుగవపాదంలో ఏ కారము(ఎ,ఏ - అచ్చులు) లతో కూర్చబడింది. గమనించగలరు.
Post Date: Mon, 22 Aug 2022 16:56:33 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger