Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 30 August 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౫(615) - Aditya Srirambhatla

( విప్రుని ఘనశోకంబు ) 10.2-1281-సీ. నరనాథ! యొకనాఁడు నలినాయతాక్షుండు- వొలుచు కుశస్థలీపురము నందు సుఖముండ నొక్క భూసురవర్యు భార్యకుఁ- బుత్త్రుండు జన్మించి పుట్టినపుడ మృతుఁడైన ఘనశోకవితతిచేఁ గ్రాఁగుచు- నా డింభకునిఁ గొంచు నవనిసురుఁడు సనుదెంచి పెలుచ రాజద్వారమునఁ బెట్టి- కన్నుల బాష్పాంబుకణము లొలుక 10.2-1281.1-తే. "బాపురే! విధి నను దుఃఖపఱుపఁ దగునె?" యనుచు దూఱుచుఁ దనుఁ దిట్టుకొనుచు వగల డెంద మందంద యెరియ నాక్రందనంబు సేయుచును వచ్చి యా విప్రశేఖరుండు. భావము: "మహారాజా! తామరల వంటి విశాల నయనాల వాడు శ్రీకృష్ణుడు కుశస్థలిలో సుఖంగా ఉంటున్న రోజులలో, ఒక విప్రుని భార్యకు పుత్రుడు పుట్టి పుట్టగానే చనిపోయాడు. శోకంతో కన్నీళ్ళు పెట్టుకుని మృతబాలుడిని ఎత్తుకుని వచ్చి, ఆ బాలుడి శవాన్ని రాజద్వారం ముందు పెట్టి, విధిని నిందిస్తూ, తనను తాను తిట్టుకుంటూ, బ్రహ్మణుడు గుండెబ్రద్దలయ్యేలా "అయ్యో" అంటూ దుఃఖించసాగాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1281 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Tue, 30 Aug 2022 15:42:13 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger