Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 23 August 2022

రుచి చేకురునటయ్య భాస్కరా! - sarma

రుచి చేకురునటయ్య భాస్కరా! కొంతమందితో మాటాడకపోవడం తప్పు. మరికొంతమందితో మాటాడటమూ తప్పే. ఎవరితో మాటాడాలి ఎంతవరకు మాటాడాలి, ఎలా మాటాడాలి అన్నదే వివేకం. దానినే భాస్కరశతకంలో ఇలా చెప్పేడు,శతకకారుడు. చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుగ మంచికూర నలపాకము జేసినయైన  యందు  ఇం పొదవెడు నుప్పులేక రుచి చేకురునటయ్య భాస్కరా! ఎంతచదువు చదివినా మాటాడకూడని చోట మాటాడటం మాటాడవలసిన చోట మౌనంగా ఉండటం తప్పే! ఇది తెలుసుకోవడమే రుచి కలిగించే ఉప్పులాటి రసజ్ఞత. ఎంతచదువు చదివి ఎన్ని నేర్చినగాని హీనుడవగుణంబు మాన్చలేడు బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు విశ్వదాభిరామ వినుర వేమ పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతోకాని పోదు.పాముకి పాలు పోసిపెంచినా విషమే కక్కుతుంది. ఇది తెలుసుకోవడం విజ్ఞత. ఎంత విజ్ఞానం ఉండి ఆచరణలేని విజ్ఞానం నిష్పలం, ఉపయోగంలో లేని విజ్ఞానం అడవికాచిన వెన్నెల.
Post Date: Tue, 23 Aug 2022 03:03:42 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger