Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 4 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౮(618) - Aditya Srirambhatla

( విప్రుని ఘనశోకంబు ) 10.2-1284-క. "ఈ పగిది నీవు వగలన్ వాపోవఁగఁ జూచి యకట! వారింపంగా నోపిన విలుకాఁ డొక్కం డీ పురి లేఁ డయ్యె నయ్య! యిది పాపమగున్. 10.2-1285-సీ. పుత్త్రులఁ గోల్పోయి భూరిశోకంబున- వనటఁ బొందుచు విప్రవరులు సాల నే రాజురాజ్య మందేని వసించుదు- రా రాజుఁ దలపోయ నవనిమీఁద నటునిఁగా నాత్మ నెన్నం దగు; నీ పుత్త్రు- నే బ్రతికించెద నిపుడ పూని యటు సేయనైతి నే ననలంబు సొచ్చెద"- నని భూసురుఁడు వెఱఁగందఁ బలుక 10.2-1285.1-తే. నతఁడు విని "యీ వెడఁగుమాట లాడఁ దగునె? భూరివిక్రమశాలి రాముండు మేటి బలుఁడు హరియును శౌర్యసంపన్ను లనఁగఁ దనరు ప్రద్యుమ్నుఁ డతని నందనుఁడు మఱియు. భావము: "అయ్యా! ఇలా నీవు దుఃఖిస్తుంటే చూసి ఈ అన్యాయాన్ని వారించే సమర్ధత గల విలుకాడు ఒక్కడు అయినా ఈ నగరంలో లేడా? ఇది పాపము. ఈలోకంలో అధికంగా ఎవరి రాజ్యంలో కన్నబిడ్డల్ని పోగొట్టుకుని దుర్భరశోకంతో పరితపించే బ్రాహ్మణులు ఉంటారో, ఆ రాజు రాజు కాడు కేవలం వేషగాడు మాత్రమే. నీ కుమారుడిని నేను బ్రతికిస్తాను అలా చేయకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను." ఈ పలుకులు వినిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఇలాగా అన్నాడు. "అయ్యా! ఇలాంటి అవివేకపు మాటలు పలుక తగదు. మహా వీరులు, మహా బలశాలురు అయిన బలరామకృష్ణులు, కృష్ణకుమారుడు ప్రద్యుమ్నాదులు ఉండగా, ఇంకా... http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1285 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Sun, 04 Sep 2022 15:17:48 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger