Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 7 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౦(620) - Aditya Srirambhatla

( విప్రుని ఘనశోకంబు ) 10.2-1288-మ. "బలుఁడంగాను; మురాసురాంతకుఁడఁగాఁ; బ్రద్యుమ్నుఁడంగాను; నేఁ దెలియం దత్తనయుండఁగా"నని "విరోధివ్రాతమున్ భీషణో జ్జ్వలగాండీవ ధనుర్విముక్త నిశితాస్త్రశ్రేణిచేఁ బీన్గుపెం టలు గావించు పరాక్రమప్రకటచండస్ఫూర్తి నేఁ బార్థుఁడన్. 10.2-1289-వ. అదియునుం గాక. 10.2-1290-చ. బలిమిఁ బురాంతకుం దొడరి బాహువిజృంభణమొప్ప నెక్కటిం దలపడి పోరినట్టి రణధైర్యుని నన్ను నెఱుంగ వక్కటా! పెలుకుఱ మృత్యుదేవతను బింకమడంచి భవత్తనూజుల న్నలవుఁజలంబుఁ జూపి కొనియాడఁగ నిప్పుడతెచ్చియిచ్చెదన్. " భావము: "నేను బలరాముడినికాను కృష్ణుడిని కాను; ప్రద్యుమ్నుడిని కాను; అతని కొడుకైన అనిరుద్ధుడిని కాను. యుద్ధంలో నా భీకరమైన గాండీవం నుండి వెలువడే వాడిబాణాలతో శత్రువులను చీల్చిచెండాడే మహాపరాక్రమం కలిగిన నేను అర్జునుడిని. అంతేకాక అయ్యా! ఆ పరమశివుడినే ఎదిరించి పోరాడి భుజబలం చూపిన నన్నే ఎరుగవా? మృత్యుదేవత పొగరు అణచి, నా పట్టు ప్రదర్శించి, నీ పుత్రులను ఇప్పుడే తీసుకు వచ్చి ఇస్తాను." http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1290 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Tue, 06 Sep 2022 17:12:48 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger