Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 16 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౭(627) - Aditya Srirambhatla

( విప్రుని ఘనశోకంబు ) 10.2-1302-చ. నర సుర యక్ష కింపురుష నాగ నిశాచర సిద్ధ సాధ్య ఖే చర విహగేంద్ర గుహ్యక పిశాచ నివాసములందు రోసి భూ సురసుత లేగినట్టి గతి సొప్పడకుండుటఁ జూచి క్రమ్మఱన్ ధరణికి నేగుదెంచి బెడిదంబుగ నగ్ని సొరంగఁ బూనినన్. 10.2-1303-వ. అవ్విధంబంతయు నెఱింగి యమ్మురాంతకుండు "విప్రనందనుల నీకుం జూపెద" నని యనలంబు సొరకుండ నతని నివారించి యప్పుడు. భావము: దేవ, యక్ష, కింపురుష, నాగ, రాక్షస, సిద్ధ, సాధ్య, ఖేచరాదుల ఇళ్ళకు వెళ్ళి బ్రాహ్మణపుత్రుల కోసం వెదికాడు. కాని వారి జాడ అక్కడ కూడా దొరకలేదు. చివరకు మళ్ళీ భూలోకానికి వచ్చాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం అగ్నిప్రవేశం చేయటానికి పట్టుదలగా సిద్ధపడ్డాడు. శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకుని "బ్రాహ్మణ కుమారులను నేను నీకు చూపిస్తాను." అని చెప్పి అర్జునుడిని మంటల్లో దూకకుండా వారించాడు. పిమ్మట... http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1302 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Fri, 16 Sep 2022 16:35:13 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger