Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 19 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౧(631) - Aditya Srirambhatla

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 10.2-1310-సీ. సాంద్రశరచ్చంద్ర చంద్రికా కర్పూర- నీహార హారాభ దేహ మమర నిందింది రేందీవ రేంద్ర నీలద్యుతిఁ- గర మొప్పు మేచక కంఠసమితి యరుణాంశుబింబ భాసుర పద్మరాగ వి- స్యస్త సహస్రోరు మస్తకములు వివృతాననోద్గత విషధూమరేఖల- లీలఁ జూపట్టిన నాలుకలును 10.2-1310.1-తే. గలిత సాయంతనజ్వలజ్జ్వలన కుండ ముల విడంబించు వేఁడి చూపులును గలిగి భూరి కలధౌత గిరినిభాకార మమరఁ బరఁగు భోగీంద్రభోగతల్పంబు నందు. 10.2-1311-వ. సుఖాసీనుండై యున్నవాని డాయంజని యప్పుడు. భావము: అటువంటి ఆ దివ్యభవనంలో దట్టమైన శరత్కాలపు పండువెన్నెల, కర్పూరం, మంచులకు సాటివచ్చే తెల్లనిదేహము; తుమ్మెదల్లాగా నల్లకలువల్లాగా ఇంద్రనీలమణులలాంటి నల్లని కంఠాలు; ఉదయకాలం సూర్యుడిలాగా ప్రకాశించే పద్మరాగమణులతో కూడిన పడగలు; తెరచుకున్న నోళ్ళ నుంచి వెలువడే విషపు పొగలలా ఉన్న నాలుకలు; యాగగుండాలలోని జ్వాలలాగ ప్రకాశించే వేడిచూపులు; వెండికొండలాగా ఉన్న భారీ ఆకారము కలిగిన ఆదిశేషుడు. ఆ ఆదిశేషుని పాన్పుగా కొని సుఖంగా ఆసీనుడై ఉన్న తేజోమూర్తి దగ్గరకు శ్రీకృష్ణార్జునులు వెళ్ళి దర్శించారు http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1310 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Sun, 18 Sep 2022 18:10:36 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger