Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 23 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౬(636) - Aditya Srirambhatla

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 10.2-1318-చ. అనిమిషనాథనంద,నుఁ డహర్పతితేజుఁడు గృష్ణుతోడఁ దాఁ జని యచటం గనుంగొనిన సర్వశరణ్యునిఁ, బుండరీకనే త్రుని, నిజధామ వైభవసదున్నత తన్మహనీయ కీర్తికిన్ మనమున మోదమంది పలుమాఱును సన్నుతిఁ జేసె భూవరా! 10.2-1319-తే. వారిజాక్షుని భక్తమందారు ననఘుఁ గృష్ణు నఖిలేశుఁ గేశవు జిష్ణుఁ బరము వినుతి సేయుచుఁ దత్పాదవనజములకు వందనము లాచరించి యానంద మొందె. భావము: ఓ మహారాజా పరీక్షిత్తు! ఇంద్రతనయుడు సూర్యసమతేజస్వి అయిన అర్జునుడు కృష్ణుడితో వెళ్ళి తను దర్శించిన ఆ లోకశరణ్యుడు విష్ణుమూర్తి సౌధవైభవం; ఆయన మహనీయ సమున్నత యశస్సునకు మనస్సులో ఆనందించి పెక్కుమార్లు స్తుతించాడు. పద్మాక్షుడిని, భక్తమందారుని, పుణ్యాత్ముని, అఖిలేశుని, కేశవుని, జయశీలుని, పరమాత్ముని, శ్రీకృష్ణుడిని స్తుతించి; ఆయన పాదపద్మాలకు ప్రణామాలు చేసి అర్జునుడు మిక్కిలి ఆనందించాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1319 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Fri, 23 Sep 2022 15:10:08 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger