Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 15 September 2022

శబ్దచిత్రములో స్థానచిత్రము - ఏ.వి.రమణరాజు

శబ్దచిత్రములో స్థానచిత్రము సాహితీమిత్రులారా! వర్ణములు 5 స్థానాలలో ఉత్పత్తి అగును. కంఠమునందు పుట్టునవు  కంఠ్యములని, తాలువు(దవడలు)నందు పుట్టునవి తాలవ్యములని, మూర్ధమునందు పుట్టునవి మూర్ధన్యములని, దంతములనందు పుట్టునవి దంత్యములని, ఓష్ఠమునందు పుట్టునవి ఓష్ఠ్యములని పిలువబడుచున్నవి. తాలవ్యాక్షరములు - అచ్చులలో ఇ,ఈ వర్గాక్షరములలో చ వర్గము, అంతస్థములలో - య, ఊష్మములలో - శ అనునవి. ఇవి ఉపయోగించక మిగిలిన వాటిని ఉపయోగించి పద్యము లేక శ్లోకము కూర్చిన అది నిస్తాలవ్యమనబడును. సరస్వతీకంఠాభరణములోని ఈ శ్లోకం చూడండి- స్ఫురత్కుండల రత్నౌఘ మఘవద్ధను కర్బురః మేఘనాదోऽథ సంగ్రామే ప్రావృట్కాలవదాబభౌ (2-268) ప్రకాశించుచున్న కర్ణభూషణ రత్న సమూహ మనెడి హరివిల్లుచేత పొడలు గలిగినవాడై సంగ్రామమునందు మేఘనాథుడు(ఇంద్రజిత్తు) ప్రావృట్కాలము(వర్షర్తువు) వలె ప్రకాశించెను. దీనిలో తాలవ్యములుగాక మిగిలినవి ఉపయోగించుటవలన దీనిని నిస్తాలవ్యము  అంటారు. ఇది శబ్దచిత్రములో స్థానచిత్రము నకు సంబంధిచినది.
Post Date: Thu, 15 Sep 2022 13:55:32 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger