( కృష్ణ సందర్శనంబు ) 11-14-క. "జనములు నిను సేవింపని దినములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచు నుండుం దనువులు నిలుకడ గావఁట వనములలో నున్ననైన వనరుహనాభా! 11-15-క. తరణంబులు భవజలధికి, హరణంబులు దురితలతల, కాగమముల కా భరణంబు, లార్తజనులకు శరణంబులు, నీదు దివ్యచరణంబు లిలన్. భావము: "పద్మనాభా! నిను సేవించని దినములు సర్వం మానవులకు ప్రయోజన శూన్యములు; అడవులలో ఉన్నా దేహాలకు నిలుకడలు లేనివి. నీ దివ్యమైన పాదములు భవసముద్రం దాటించే నావలు; పాపాలతీగలను హరించేవి; ఆగమములకు అలంకారాలు; ఆర్తులకు శరణములు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=15 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Thu, 13 Oct 2022 15:49:54 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Thu, 13 Oct 2022 15:49:54 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment