Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 31 October 2022

పిల్లలను పెంచకండి.. - బివిడి ప్రసాదరావు

అ వును.. నిజమే. మీరు చదివింది పక్కా యదార్థం. కానీ ఇంకా ఆ శీర్షిక పూర్తి కాలేదు. నిజానికి తల్లితండ్రులలో ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని నిబంధనలతో కూడిన నిర్బంధముల నడుమ పెంచుతున్నారు. ' పిల్లల్ని ఇలా ఉండ రాదు , అలా ఉండ రాదు ' అన్న చట్రంలోనే పెంచుతున్నారు. తమ తమ పెద్దరికంతో ' ఇది తప్పు , అది తప్పు మరియు ఇది చేయకు , అది చేయకు ' అంటూనే తమ చేతి వాటంతో , తమ మాట తీరుతో  పెంచుతున్నారు. ఇవన్నీ ఆలోచించ తగ్గవి. అంతే కాదు ఇట్టివి తప్పక సరి చేయ తగ్గవి కూడా. అలాగే చాలా మంది తల్లితండ్రులు.. ఆడ పిల్లల విషయంతో ఒక రీతిన , మగ పిల్లల విషయంతో ఒక రీతిగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడే ఆంక్షలు తీవ్రంగా ఉంటాయి. ఆశలు గుప్పుమంటాయి. ఈ వాటం ఎంత మాత్రం హర్షణీయం కాదు. సమర్ధనీయం కాదు. ప్రతి తల్లి , తండ్రి సరిదిద్దుకోవలసింది ఇక్కడే. ఈ వ్యత్యాసాలు పిల్లల మానసిక స్థితిని చిందరవందర పరుస్తాయని వాళ్లు గ్రహించి తీరాలి. పిల్లల్లో ఆడ , మగ అన్నది వాళ్ల శారీరక నిర్మాణం మేరకే పరిమితమవ్వాలి తప్పా. అదొక అసమాన్యం అన్న ఆలోచన తగదు. ప్రతి తల్లి , ప్రతి తండ్రి తమ పిల్లల విషయంలో మెలుకువ వహించాలి కానీ అదొక బృహత్ అధికారంగా వ్యవహరించ రాదు. ఈ కారణాల చేతనే.. 'పిల్లలను పెంచకండి'.. అన్న శీర్షికను ఇచ్చాను. ఇది అసంపూర్తిది అన్నాను కూడా. మరి సంపూర్ణం ఎలా.. ఏమిటి ? పిల్లల పెంపకం సాఫీగా జరిగి పోయేలా తల్లితండ్రులు మెసులు కోవాలి కానీ తాము పిల్లలకు కంచె మాదిరి మార కాకూడదు. ఆపద ఎదురొస్తే ఎలా తనకు తాను సహాయం కావాలో పిల్లలకు తల్లితండ్రులు తమ బాధ్యతగా నేర్పాలి. అదే మాదిరిగా ఎదుటి వారికి అవసరమైనప్పుడు పిల్లలైనా వారు ఎలా వారికి తోడవ్వాలో తెలియ చేయాలి. మగ పిల్లలకు.. నీ తల్లి , నీ చెల్లి , నీ చెలి , నీ ఆలి , నీ కూతురు , ఇట్టివి వగైరాలు.. ఒక ఆడది అన్నది నొక్కి వక్కాణించాలి. ' స్త్రీ పట్ల వివక్ష , కాంక్ష వలదు ' అన్నది చిరు వయస్సు నుండి తప్పక నేర్పి తీరాలి. ఆడ పిల్లలకు.. నీ నాన్న , నీ అన్న , నీ స్నేహితుడు , నీ భర్త , నీ కొడుకు , ఇట్టివి వగైరాలు..  ఒక మగాడు అన్నది విడ మర్చి చెప్పాలి. ' పురుషుడు పట్ల భీతి , భ్రాంతి వలదు ' అన్నది చిన్నప్పుడు నుండి తప్పక వివరించాలి. పిల్లలకు పరివేక్షణతో కూడిన స్వేచ్ఛను అందించాలి. వాళ్ల యోచనలను ఆలకించాలి. పిమ్మట అవసరమనిపిస్తే తగు తీరైన సూచనలతో సరి చేయాలి. అంతే కానీ వాటిని తుంచు రాదు. తమ పనులు తాము చేసుకొనేలా మాత్రమే పిల్లలను పెద్దలు ప్రోత్సహించాలి కానీ , తమంతట తాము పిల్లలు కష్టపడి పోతున్నారని మరియు తమ పనులకు వారి పనులు ఆటంకం అయిపోతున్నాయని.. తామే ఆ పనులు చేసేసి చేతులు దులిపేసుకోరాదు. అల్లరి ఉంది. దాని అవసరం ఉంటుంది. అంతే కానీ అదేదో ప్రళయం కాదు. బ్రహ్మాండం కాదు. నిజానికి అది పిల్లల వాటం. దాని మోతాదు మితి మీరనీయక పెద్దలు మెసలాలి కానీ , పెద్దరికం అంటూ బెత్తంతో కానీ , చేతి వాటంతో కానీ వాళ్ల అల్లరులను అడ్డుకోకూడదు. వాళ్ల చేష్టలను ముచ్చటగా మెచ్చుకుంటూ మరియు మురిపెంగా సరిదిద్దుతూ.. తల్లితండ్రులు వ్యహరిస్తే పిల్లల మానసికి వికాసం విరాజిల్లుతుంది. పిల్లల్లో ప్రతిభ ఉంటుంది అనే కన్నా , దానిని సరిగ్గా గ్రహించడం మిన్న. అలా గ్రహించేక దానిని అమలు పర్చేలా చూడడం మరింత గొప్ప. ఆ గొప్పతనం తల్లితండ్రులకు సొత్తుగా మిగలాలి. అందుకు పెద్దలు.. తమ పిల్లల అభిరుచులను గుర్తిస్తూ , వాటికి తగ్గ తీరున తమ పిల్లల పట్ల తాము శ్రద్ధ వహించాలి. తద్వారా పిల్లల భవిష్యత్తుతో పాటు తమ పెద్దరికం కూడా నిలుస్తుందని ప్రతి పెద్ద వారు నమ్మాలి. పిల్లలు పెద్దల ఆసరాతోనే ఎదుగుతారు. ఇది పెద్దలు గుర్తించాలి. కనుక తమ బాట చక్కతనమే తమ పిల్లల నడతకు సుతారమని పెద్దలు తప్పక గ్రహించాలి. అందుకే ఇదంతా చెప్పి ఇప్పుడు శీర్షికను.. ' పిల్లలను పెంచకండి.. పెరగనీయండి ' అంటూ ఈ నా కబురులను సంపూర్ణం చేస్తున్నాను. ***
Post Date: Mon, 31 Oct 2022 05:05:08 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger