Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 28 March 2023

సుశ్లోక రాఘవం - ఏ.వి.రమణరాజు

సుశ్లోక రాఘవం సాహితీమిత్రులారా! సుశ్లోక రాఘవం 1సు శ్లోక= మంచి కీర్తిగల,రాఘవం=  రఘువంశ రాముడు. 2సుశ్లోక=మంచి సంస్కృత పద్యాలు కలిగిన,లాఘవం=లఘువు (చిన్న చమత్కృతి)  {ర,ల-యోరభేదః} రచన:పంత విఠల, క్రీ.శ.1853 కాలం: 19వశాతాబ్దప్రారంభంలోనూ ఉన్నాడు. సుశ్లోక లా(రా)ఘవంలో 552 ముక్తక శ్లోకాలు కలిగిన రచన.ప్రతి శ్లోకంకూడ శ్లేష చమత్కారంతో ఉంది. గ్రంథరచన పూర్తికాగానే కవిగారే నాగర లిపిలో ముద్రణ వేయించినాడు.   ఈ పండితకవివర్యులు మహారాష్ట్రం వారు.కరహాటక క్షేత్ర నివాసి., గీతా-మహాదేవుల పుత్రరత్నం.ఈ పండితకవి శ్రీనివాసపండిత ప్రతినిధిధర్మ పరిషత్ లో ప్రధాన పండితవర్యులుగ ఉండినారని తెలియవస్తుంది. అన్నిటికిమించి శ్రీరామచంద్రమూర్తిని కులదైవతంగఆరాధించినభక్తితత్పరుడు ఈ కవిపండితవర్యుడు శృంగార, వేదాంత,వ్యాకరణ,ఆయుర్వేద,ఖగోళ, శకునశాస్త్ర,భాగవత పురాణాదులకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను విశేషంగ   ఈగ్రంథంలో  శ్లేషచమత్కా రంతో చెప్పినాడు. ఈ గ్రంథానికి పంతవిఠలుని శిష్యు డైన నారాయణులవారు "సద్భక్తి"అనే (శ్రుతలిఖిత)అనే వ్యాఖ్యను రచించి నాడు. ఈ వ్యాఖ్యను ఆధారంగ డా.ఆద రాసుపల్లి యజ్ఞరాములు, డా.కండ్లకుంట అలహసింగరాచార్యులు తెలుగు చేసినారు. ఈ గ్రంథాన్ని డా.పుల్లెల శ్రీరామచంద్రుడుగారి "ప్రస్తావన" తో--- కీ.శే.బ్రహ్మశ్రీ కాసులవిశ్వనాథశాస్త్రి గారు,వారికుమారులు తెలుగులిపిలో ఆగష్టు1993లో ప్రచురించినారు. సుశ్లోక లా(రా)ఘవంలోని మొదటి శ్లోకం--- అలంకృతి పరిష్కృతః  సురసభావన పండితః ప్రణనష్టఖరదూషణః   ప్రథితచారువృత్త స్థితః l ప్రమోదయతి యః సతః  సుగుణతః స్వకశ్లోకతః ప్రభూ రవికులాగ్రణీః  కవివరేణ్యవద్రాజతే ll అలంకృతి పరిష్కృతః= 1.అలంకారభూషితుడు/          2.అలంకారశాస్త్రపండితుడు, సురసభావనే పండితః= 1.దేవసమాజమును రక్షించువాడు 2.శృంగారాదిరసప్రయోగంలోపండితుడు ప్రణనష్ట ఖరదూషణః= 1.ఖరదూషణులనుసంహరించినవాడు/ 2.దుష్టులుచేయునిందలనుతొలగించువాడు, ప్రథితచారు వృత్తస్థితః= 1.ప్రసిద్ధమైనమంచిశీలం కలవాడు, 2.శార్దూలాదివృత్తప్రయోగనిపుణుడు, ప్రభూ రవికులాగ్రణీ కవివరేణ్యవ ద్రాజతే= సత్పురుషులను సంతోషపరచునట్టి 1.సూర్యవంశశ్రేష్ఠుడైన రామచంద్రుడు, 2.కవిశ్రేష్ఠునివలె , ప్రకాశిస్తున్నాడు. 1.రవివంశ వర్యా! 2.సుకవి వర్యా ! వైద్యవేంకటేశ్వరాచార్యులు గారి సౌజన్యంతో
Post Date: Tue, 28 Mar 2023 17:11:11 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger