Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 3 November 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౧(671) - Aditya Srirambhatla

( విదేహ హర్షభ సంభాషణ ) 11-44-సీ. సంతతంబును గృష్ణ సంకీర్తనంబులు- వీనుల కింపుగ వినఁగవలయు, హర్షంబుతోడుత హరినామకథనంబు- పాటలఁ నాటలఁ బరఁగవలయు, నారాయణుని దివ్యనామాక్షరంబులు- హృద్వీథి సతతంబు నెన్నవలయుఁ, గంజాక్షులీలలు కాంతారముల నైన- భక్తి యుక్తంబుగాఁ బాడవలయు, 11-44.1-తే. వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని నొడువుచును లోకబాహ్యత నొందవలయు, నింతయును విష్ణుమయ మని యెఱుఁగవలయు, భేద మొనరింప వలవదు మేదినీశ!" భావము: ఓ రాజా! సదా శ్రీకృష్ణ సంకీర్తనలు వీనులవిందుగా వినాలి; హరినామ కథనాన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ చెయ్యాలి; నారాయణుని దివ్యమైన నామాలను హృదయంలో సదా స్మరిస్తూ ఉండాలి; కమలనయనుని లీలలను అడవులలో చరిస్తున్నా భక్తియుక్తంగా పాడాలి; విశ్వమయుడిని వెఱ్ఱిగా కీర్తిస్తూ లోకానికి అంటీ అంటకుండా ఉండాలి; ఈ సృష్టి మొత్తం విష్ణుమయ మని తెలుసుకోవాలి; భేదబుద్ధి ఏ మాత్రమూ చూపరాదు." http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=7&Padyam=44 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Thu, 03 Nov 2022 15:17:29 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger