Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 4 November 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౨(672) - Aditya Srirambhatla

( విదేహ హర్షభ సంభాషణ ) 11-45-వ. అనిన విదేహభూపాలుడు "భాగవతధర్మం బెద్ది? యే ప్రకారంబునం బ్రవర్తించు? వారల చిహ్నంబు లెవ్వి? యంతయు నెఱింగింప నీవ యర్హుండ" వనిన నందు హరి యను మహాత్ముం డిట్లనియ. 11-46-తే. "సర్వభూతమయుండైన సరసిజాక్షుఁ డతఁడె తన యాత్మయం దుండు ననెడువాఁడు, శంఖచక్రధరుం డంచుఁ జనెడువాఁడు, భక్తిభావాభిరతుఁడు వో భాగవతుఁడు. 11-47-క. వర్ణాశ్రమధర్మంబుల నిర్ణయకర్మములఁ జెడక నిఖిలజగత్సం పూర్ణుఁడు హరి యను నాతఁడె వర్ణింపఁగ భాగవతుఁడు వసుధాధీశా! భావము: అని మహాముని కవి చెప్పాడు. అంత, విదేహ రాజు ఇలా అడిగాడు. "భాగవతధర్మ మేది? అది ఏ ప్రకారంగా ప్రవర్తిస్తుంది? భాగవతుల గుర్తు లేమిటి? ఇవి చెప్పటానికి మీరే తగినవారు." దానికి వారిలో హరి అనే మహాముని ఇలా చెప్పసాగాడు: "భాగవతుడు అంటే ఆ హరి యందు భక్తీ ఆసక్తీ కలవాడు; సర్వభూతమయుడైన పద్మలోచనుడు శంఖం చక్రం దాల్చి తన ఆత్మలో ఉన్నాడనే విశ్వాసం కలవాడు. ఓ మహా రాజా విదేహ! భాగవంతుడు చతుర్వర్ణాలు చతురాశ్రమాలు వాటి ధర్మాలు కర్మలు అంటూ వీటిలో మునిగిపోకుండా, భక్తిమార్గాన్ని ఆశ్రయించి, శ్రీహరి విశ్వం అంతా నిండి ఉన్నాడు అంటాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=8&Padyam=47 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Fri, 04 Nov 2022 15:45:59 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger