( నారాయణఋషి భాషణ ) 11-73-వ. ఇవ్విధంబునం బ్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసంబు లనంతంబులు గలవు; మనోవాక్కాయకర్మంబుల హరిపూజనంబు సేయక, విపరీత గతులం దిరుగుచుండు జడుల కెవ్విధం బగు గతిగలుగు?" ననిన నప్పు డప్పుడమిఱేఁ డప్పరమపురుషుం జూచి "యట్టి జడులు ముక్తి నొందు నుపాయం బెట్టు లంతయు నెఱింగింపుఁ" డనినఁ జమసుం డిట్లనియె. 11-74-సీ. "హరిముఖ బాహూరు వరపదాబ్జములందు- వరుసఁ జతుర్వర్ణ వర్గసమితి జనియించె; నందులో సతులును శూద్రులు- హరిఁ దలంతురు; కలిహాయనముల వేదశాస్త్ర పురాణ విఖ్యాతులై కర్మ- కర్తలై విప్రులు గర్వ మెసఁగి హరిభక్తపరులను హాస్యంబు సేయుచు - నిరయంబు నొందుట నిజము గాదె? 11-74.1-తే. మృదుల పక్వాన్న భోజనములను మాని జీవహింసకుఁ జనువానిఁ జెందు నఘము; హరి నుతింపక స్త్రీలోలుఁ డైనఁవాడు నరకవాసుండు నగుచుండు ననవరతము. భావము: ఇలా హరిస్తుతి చేసి ఇలా అన్నాడు. "ఈ విధంగా ప్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసములు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. మనోవాక్కాయకర్మలా హరిపూజ చేయకుండా విపరీత మార్గాలలో తిరుగుతూ ఉండే మూఢులకు ఏవిధంగానూ సద్గతి కలుగదు." అని మహాముని అనగా ఆ మహారాజు ఆ పరమపురుషులతో "అటువంటి మూర్ఖులు ముక్తిపొందే ఉపాయం తెలియ జెప్పండి." అని అడిగాడు. వారిలో చమసుడనే మునిముఖ్యుడు విదేహుడితో ఇలా అన్నాడు. విష్ణుమూర్తి ముఖం బాహువులు తొడలు పాదములు వీటి యందు వరుసగా వర్ణములు నాలుగు పుట్టాయి. అందులో స్త్రీలు శూద్రులు హరిని తలుస్తారు. కలికాలంలో విప్రులు వేద శాస్త్ర పురాణాలందు ప్రసిద్ధులై, కర్మలుచేస్తూ గర్వంతో హరిభక్తులను అపహాస్యం చేస్తారు. వారు నరకానికి పోవటం ఖాయం. స్వచ్ఛమైన పక్వాన్నం భుజించుట మాని మాంసాహారులై జీవహింసకు పాల్పడేవాడికి పాపం తగులుతుంది. శ్రీహరిని నుతింపక స్త్రీలోలు డైనవాడికి ఎప్పుడూ నరకమే నివాసం. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=74 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Sat, 26 Nov 2022 16:35:32 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sat, 26 Nov 2022 16:35:32 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment