Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 26 November 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౦(690) - Aditya Srirambhatla

( నారాయణ‌ఋషి భాషణ ) 11-75-వ. అట్లు గావున గృహ క్షేత్ర పుత్త్ర కళత్ర ధనధాన్యాదులందు మోహితుండయి 'ముక్తిమార్గంబు లప్రత్యక్షంబు' లని నిందించువాఁడును, హరి భక్తివిరహితుండును, దుర్గతిం గూలుదు" రని మునివరుం డానతిచ్చిన విదేహుం డిట్లనియె. 11-76-ఆ. "ఏ యుగంబునందు నే రీతి వర్తించు? నెట్టి రూపువాఁడు? నెవ్విధమున మును నుతింపఁబడెను మునిదేవగణముచే విష్ణుఁ డవ్యయుండు విశ్వవిభుఁడు? భావము: అందుచేత, ఇండ్లు పొలాలు, సంతానం, భార్య, ధనం, ధాన్యం మున్నగు వాటిమీద వ్యామోహంతో మోక్షం కంటికి కనపడేదికాదు. కనుక లేదని నిందించే వారు; హరిభక్తి లేనివారు దుర్గతిలో కూలిపోతారు." అని మునిశ్రేష్ఠుడు అనగా విదేహుడు ఇలా అడిగాడు. "అవ్యయుడు, జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి ఏ యుగంలో ఏ రీతిగా ఉన్నాడు? ఏ రూపం ధరించాడు? ఏ విధంగా మునులచేత, దేవతలచేత కీర్తించబడ్డాడు?" http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=76 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Sat, 26 Nov 2022 16:36:55 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger