Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 21 November 2022

జీవుని భావోద్వేగాల ప్రకటన రూపం మనస్సు. స్వతహాగా మనస్సు జీవుని లోని అంగమే కాదు. ఇది ఒక అంతరాళం.           సూటిగా చెప్పాలంటే జీవుని యోచనలతో జ్వలించే తీరే మనస్సు.           నిజానికి జీవుని జీవన ప్రస్థానంలో ఆలోచనదే ప్రముఖ భూమిక అంటే అతిశయోక్తి కానే కాదు. అట్టి ఆలోచనల కూర్పే మనస్సు కనుక.. జీవుని ఉనికిలో మనస్సు అంటూ ఒక పాత్ర ప్రముఖంగా ప్రస్తావింపబడుతుంది.           మనస్సు ఒక గొప్పదిగా, మనస్సు ఒక చెడ్డదిగా, మనస్సు ఒక చంచలమైందిగా, మనస్సు ఒక నిత్య చపలమైందిగా, మనస్సు ఒక భావోద్వేగాల పుట్టగా, ఇట్టి వగైరాలగా మనస్సు వాడుకలో కొనసాగుతుంది. అలాగే మనస్సును నిగ్రహించుట లేదా అణుచుట బహు అసాధ్యము అనే నానుడు వినిపిస్తుంది. నిజానికి జీవుని ఆలోచనలే  మనస్సు ప్రవర్తనలకి కారకాలు అని తప్పక గ్రహించాలి. తద్వారా మనస్సు పై వినిపించే వ్యాఖ్యలని సరి చేసుకోవాలి. మనస్సు ఉనికిని పరిరక్షించగలగాలి.           జీవుని బాగోగులుకు కొలమానంగా మనస్సును నిలపడం అవుతుంది. మనస్సు స్థితిగతులుకు హేతువుగా ఆలోచనను చూపడం జరుగుతుంది. అందుకే మెరుగైన ఆలోచన సరైన మనస్సు అన్నది గుర్తించాలి.            పొందికైన మనస్సు జీవుని జీవనంకి మేలు. అందుకే జీవుని ఆలోచనలు సరళంగా ఉండాలి, సంక్షిప్తంగా ఉండాలి, మితంగా ఉండాలి. స్థిమితంగా ఉండాలి. అందుకు జీవుని అభ్యాసం  అవసరం.           ఆలోచన చెప్పి వచ్చేది కాదు. తలంపుతో తాలింపులా గుప్పు మనేది. ఒంటరిగా వస్తుందా అంటే ససేమిరా అంటూ దొంతర్లలా పొడచూపుతుంది. అందుకే తొలుత జీవుని తలంపు ఆచి తూచి జరగాలి. అటు వెంబడే అది తుంచ బడేయాలి. అప్పుడే నిమ్మళమైన మనస్సు నిలుస్తుంది. ఉభయ శ్రేయస్కరం లభిస్తుంది. ఇదంతా మేలైన సాధనతోనే వీలవుతుంది.           మనస్సు చేతల్లోకి జీవుడు పోకూడదు.. జీవుడు చేతల్లోనే మనస్సు నిలవాలి.  అట్లాటి జీవుని జీవం కుదుట పడుతుంది. అట్లాటి మనస్సు ప్రేయస్సు (ప్రియం) అగుతుంది. లేదంటే మనస్సు ఆగడం ఆగదు.. జీవుని పతనం తప్పదు.           మనస్సు గతి ఇంతే. జీవుని మతి అంతే. *** - బివిడి ప్రసాదరావు

జీవుని భావోద్వేగాల ప్రకటన రూపం మనస్సు. స్వతహాగా మనస్సు జీవుని లోని అంగమే కాదు. ఇది ఒక అంతరాళం. సూటిగా చెప్పాలంటే జీవుని యోచనలతో జ్వలించే తీరే మనస్సు. నిజానికి జీవుని జీవన ప్రస్థానంలో ఆలోచనదే ప్రముఖ భూమిక అంటే అతిశయోక్తి కానే కాదు. అట్టి ఆలోచనల కూర్పే మనస్సు  కనుక.. జీవుని ఉనికిలో మనస్సు అంటూ ఒక పాత్ర ప్రముఖంగా ప్రస్తావింపబడుతుంది. మనస్సు ఒక గొప్పదిగా , మనస్సు ఒక చెడ్డదిగా , మనస్సు ఒక చంచలమైందిగా , మనస్సు ఒక నిత్య చపలమైందిగా , మనస్సు ఒక భావోద్వేగాల పుట్టగా, ఇట్టి వగైరాలగా మనస్సు వాడుకలో కొనసాగుతుంది. అలాగే మనస్సును నిగ్రహించుట లేదా అణుచుట బహు అసాధ్యము అనే నానుడు వినిపిస్తుంది. నిజానికి జీవుని ఆలోచనలే  మనస్సు ప్రవర్తనలకి కారకాలు అని తప్పక గ్రహించాలి. తద్వారా మనస్సు పై వినిపించే వ్యాఖ్యలని సరి చేసుకోవాలి. మనస్సు ఉనికిని పరిరక్షించగలగాలి. జీవుని బాగోగులుకు కొలమానంగా మనస్సును నిలపడం అవుతుంది. మనస్సు స్థితిగతులుకు హేతువుగా ఆలోచనను చూపడం జరుగుతుంది. అందుకే మెరుగైన ఆలోచన సరైన మనస్సు అన్నది గుర్తించాలి. పొందికైన మనస్సు జీవుని జీవనంకి మేలు. అందుకే జీవుని ఆలోచనలు సరళంగా ఉండాలి , సంక్షిప్తంగా ఉండాలి , మితంగా ఉండాలి. స్థిమితంగా ఉండాలి. అందుకు జీవుని అభ్యాసం  అవసరం. ఆలోచన చెప్పి వచ్చేది కాదు. తలంపుతో తాలింపులా గుప్పు మనేది. ఒంటరిగా వస్తుందా అంటే ససేమిరా అంటూ దొంతర్లలా పొడచూపుతుంది. అందుకే తొలుత జీవుని తలంపు ఆచి తూచి జరగాలి. అటు వెంబడే అది తుంచ బడేయాలి. అప్పుడే నిమ్మళమైన మనస్సు నిలుస్తుంది. ఉభయ శ్రేయస్కరం లభిస్తుంది. ఇదంతా మేలైన సాధనతోనే వీలవుతుంది. మనస్సు చేతల్లోకి జీవుడు పోకూడదు.. జీవుడు చేతల్లోనే మనస్సు నిలవాలి.  అట్లాటి జీవుని జీవం కుదుట పడుతుంది. అట్లాటి మనస్సు ప్రేయస్సు (ప్రియం)  అగుతుంది. లేదంటే మనస్సు ఆగడం ఆగదు.. జీవుని పతనం తప్పదు. మనస్సు గతి ఇంతే. జీవుని మతి అంతే. ***
Post Date: Mon, 21 Nov 2022 05:16:11 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger