Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 6 November 2022

ఉబోస కావాలి ఒక నెలనుంచి ఒక పెద్దాయన ఉదయం నడకకొస్తున్నారు, ఒకటి రెండు రోజులు నడవగా చూసాను, ఆ తరవాత ఆయన నడిచింది చూడలే! ట్రేక్ దగ్గరే బెంచి మీద కూచుని ఉంటున్నాడు, నడిచేవాళ్ళని చూస్తూ! ఈయనకేం పెద్ద వయసనుకోకండి, మొన్ననే అరవై వచ్చినవాడు, కొత్తగా స్టెంటు వేయించుకున్నవాడు.డాక్టర్ బహుశః నడవమని చెప్పి ఉంటాడు. కాళ్ళకి నీ కేప్ లు వేసుకుని అవస్థ పడుతుండగా చూసాను. తెలిసినవాడే! తెల్లగా పాలిపోయాడు, ఏంటి సంగతంటే, నాకే అనిపించినది. ఆయన ఒక ఏ.సి బాధితుడని. ఇంటిదగ్గర ఏ.సి, ఆఫీసులో ఏ.సి, కారులోనూ ఏ.సి. అదీ బాగా కూల్ గా. మనిషి పాలిపోక మరెలా ఉంటాడు? కష్టపడి ఉదయం సూర్యుని కోసం చూస్తూ ఉంటాడు, సూర్యుడు కనపడ్డాకా పావుగంటకి వెళిపోతుంటాడు. ఆయన చుట్టూ భజంత్రీలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు :) ఇది చూసి కొంచం బాధ కలిగింది, ఆగలేకపోయా! చెప్పాలనిపించింది  చెబుతున్నా, ఉబోస అనుకున్నా ఏమనుకున్నా! అని చెప్పేసానిలా!మోకాళ్ళ నెప్పులు తగ్గలంటే బరువు తగ్గాలి, అది అంత తొందరగా జరగదు, నడిస్తే బరువు తగ్గుతుంది, నడవాలంటే మోకాళ్ళనెప్పులు,ఇలా ఇది ఒక విషవలయం. నడవడానికి ప్రయత్నించాలంటే, మోకాళ్ళకి చిన్న చెంచాడు ఆవునెయ్యి,నాలుగు చుక్కల నిమ్మరసంకలిపిరాయండి, నెప్పులు తగ్గిపోతాయనను,   నడవడానికి కొంత అనుకూలిస్తాయి, చెప్పాలనిపించింది, చెప్పేసా! ఉబోస అనుకున్నా ఏమనుకున్నా!  వద్దనుకుంటూ ఉన్నా ఉబోసలు పెరిగాయి :) తగ్గేదెలా? ఎవరేనా స్పందించకుండా ఉండేందుకు  ఉబోస చెప్పరాదూ?  :) - sarma

ఉబోస కావాలి ఒక నెలనుంచి ఒక పెద్దాయన ఉదయం నడకకొస్తున్నారు, ఒకటి రెండు రోజులు నడవగా చూసాను, ఆ తరవాత ఆయన నడిచింది చూడలే! ట్రేక్ దగ్గరే బెంచి మీద కూచుని ఉంటున్నాడు, నడిచేవాళ్ళని చూస్తూ! ఈయనకేం పెద్ద వయసనుకోకండి, మొన్ననే అరవై వచ్చినవాడు, కొత్తగా స్టెంటు వేయించుకున్నవాడు.డాక్టర్ బహుశః నడవమని చెప్పి ఉంటాడు. కాళ్ళకి నీ కేప్ లు వేసుకుని అవస్థ పడుతుండగా చూసాను. తెలిసినవాడే! తెల్లగా పాలిపోయాడు, ఏంటి సంగతంటే, నాకే అనిపించినది. ఆయన ఒక ఏ.సి బాధితుడని. ఇంటిదగ్గర ఏ.సి, ఆఫీసులో ఏ.సి, కారులోనూ ఏ.సి. అదీ బాగా కూల్ గా. మనిషి పాలిపోక మరెలా ఉంటాడు? కష్టపడి ఉదయం సూర్యుని కోసం చూస్తూ ఉంటాడు, సూర్యుడు కనపడ్డాకా పావుగంటకి వెళిపోతుంటాడు. ఆయన చుట్టూ భజంత్రీలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు :) ఇది చూసి కొంచం బాధ కలిగింది, ఆగలేకపోయా!  చెప్పాలనిపించింది చెబుతున్నా, ఉబోస అనుకున్నా ఏమనుకున్నా! అని చెప్పేసానిలా! మోకాళ్ళ నెప్పులు తగ్గలంటే బరువు తగ్గాలి, అది అంత తొందరగా జరగదు, నడిస్తే బరువు తగ్గుతుంది, నడవాలంటే మోకాళ్ళనెప్పులు,ఇలా ఇది ఒక విషవలయం. నడవడానికి ప్రయత్నించాలంటే, మోకాళ్ళకి చిన్న చెంచాడు ఆవునెయ్యి,నాలుగు చుక్కల నిమ్మరసంకలిపిరాయండి, నెప్పులు తగ్గిపోతాయనను, నడవడానికి కొంత అనుకూలిస్తాయి,  చెప్పాలనిపించింది, చెప్పేసా! ఉబోస అనుకున్నా ఏమనుకున్నా! వద్దనుకుంటూ ఉన్నా ఉబోసలు పెరిగాయి :) తగ్గేదెలా? ఎవరేనా స్పందించకుండా  ఉండేందుకు ఉబోస చెప్పరాదూ?  :)
Post Date: Sun, 06 Nov 2022 04:14:27 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger