( ప్రభాసంకు బంపుట ) 11-88-క. నారాయణు వచనముల క పారంబగు సమ్మదమున బలములతోడన్ దార సుత మిత్ర యుతులై వారణ హయ సమితితోడ వడి నేఁగి రొగిన్. 11-89-వ. అంత. 11-90-క. జ్ఞానమున నుద్ధవుఁడు దన మానసమున నెఱిఁగి శ్రీరమాధిప! హరి! యో దీనజనకల్పభూజ! సు ధీనాయక! మాకు నీవె దిక్కని పొగడెన్. భావము: శ్రీకృష్ణుని మాటలు వినిన యాదవులు అందరూ మిక్కిలి సంతోషంతో భార్యా బిడ్డలతో, మిత్రులతో కలసి ఏనుగులు గుఱ్ఱాలు సైన్యాలు తీసుకుని వెంటనే బయలుదేరి ప్రభాసతీర్థానికి వెళ్ళారు. అప్పుడు ఉద్ధవుడు తనకు ఉన్న జ్ఞానంతో ఈ విషయం అంతా గ్రహించి, "లక్ష్మీవల్లభా! శ్రీహరీ! దీనల పాలిటి కల్పవృక్షమా! బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు అయిన నీవే మాకు దిక్కు" అని స్తుతించాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=16&Padyam=89 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Fri, 16 Dec 2022 14:58:51 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 16 Dec 2022 14:58:51 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment