Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 18 December 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౧(701) - Aditya Srirambhatla

( అవధూత సంభాషణ ) 11-92-ఉ. పంకజనాభుఁ డుద్ధవునిపైఁ గల కూర్మిని జెప్పె నొప్ప నెం దంకిలి లేక యన్నిదిశలందుఁ జరించుచు నిత్యతృప్తుఁడై శంకరవేషధారి యొక సంయమి యా యదురాజుఁ జేర నే వంకనునుండి వచ్చి తన వానికి నిట్లనె నర్థి నేర్పడన్‌. 11-93-క. అవధూత వల్కె నంతటఁ "బ్రవిమల విజ్ఞాన నిపుణ భవ్యులు గురువుల్‌ తవిలిన నిరువదినలువురు నవనిన్‌ విజ్ఞాని నైతి" నని పల్కుటయున్‌. భావము: పద్మనాభుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద కల ప్రేమతో ఇలా చెప్పాడు. "ఒకప్పుడు యదురాజు దగ్గరకు ఎక్కడినుండో శంకరవేషాన్ని ధరించిన ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక సకల దిక్కుల తిరిగుతుంటాడు. ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు. యదురాజు ఆ యోగికి మర్యాదచేసి "ఎక్కడ నుండి వచ్చారు" అని ఆసక్తితో అడిగాడు. యోగి ఇలా అన్నాడు. "నిర్మలమైన విజ్ఞానంలో నిపుణులైన భవ్యులు ఇరవైనలుగురు నాకు గురువులు. వారివలన నేను విజ్ఞానిని అయినాను." అని యోగి అనగా... http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=93 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Sun, 18 Dec 2022 13:30:43 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger